కేసీఆర్.. ఫాంహౌస్‌లో కూర్చొని నీరోచక్రవర్తిలాగా వ్యవహరించొద్దు..!

సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ అధ్యక్షుడు, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. కేసీఆర్ ఫాంహౌజ్ లో కూర్చొని నీరోచక్రవర్తిలాగా వ్యవహరించవద్దని ఆయన ఫైర్ అయ్యారు. సమీక్ష చేస్తున్నామని మభ్యపెట్టొద్దని.. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలన్నారు. వరద ప్రభావిత ప్రాంతంలో బాధితులు కట్టు బట్టలతో మిగిలిపోయారన్నారు. ఇళ్లలో సామాను కొట్టుకుపోయిన వారికి ఒక్కో ఇంటికి 25 వేల రూపాయలు ప్రభుత్వం తక్షణమే ఇవ్వాలని.. వెంటనే సర్వే చేయించాలని ఈటల డిమాండ్ చేశారు.

New Update
Etela Rajender : సీఎం రేవంత్‌కు ఈటల సవాల్

సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ అధ్యక్షుడు, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. కేసీఆర్ ఫాంహౌజ్ లో కూర్చొని నీరోచక్రవర్తిలాగా వ్యవహరించవద్దని ఆయన ఫైర్ అయ్యారు. సమీక్ష చేస్తున్నామని మభ్యపెట్టొద్దని.. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలన్నారు. ఇక ఉత్తర తెలంగాణాకు ప్రాణ ప్రదాయిని అయిన గోదావరి సీఎం కేసీఆర్  నిర్లక్ష్యం కారణంగానే దుఃఖదాయినిగా మిగిలిందన్నారు.

బీజేపీ ప్రాజెక్ట్స్ ఇంకా చెక్ డ్యామ్ లకు ఏమాత్రం వ్యతిరేకం కాదని ఈటల స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ అనాలోచిత నిర్ణయాలకు మాత్రం వ్యతిరేకమన్నారు. దాని వల్ల మంచిర్యాల ప్రతి ఏడాది వర్షాకాలంలో మునిగిపోతుందని.. పొలాల్లో ఇసుక మేట వేశాయన్నారు. తాటిచెట్టు లోతు కయ్యలు పడ్డాయన్నారు. పొలాలు జీవితంలో అక్కర రాకుండా పోయాయన్నారు. ఇక కడెం తెగిపోతే 35 ఊర్లు కొట్టుకు పోతాయన్న ఈటల.. గేట్ల సంఖ్య పెంచమని నిపుణుల కమిటీ నివేదిక ఇస్తే కేసీఆర్ దాన్ని అమలు చెయ్యలేదని మండిప్డడారు. కడెం కింద ఉన్న గ్రామాలవాసులు  నిద్ర లేని రాత్రులు గడపడం.. కేసీఆర్ నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యమని ఈటల ధ్వజమెత్తారు.

గత సీజన్లో పంట నష్టానికి 10 వేల రూపాయలు ఇస్తామని ఇప్పటి వరకు  కేసీఆర్ ఇవ్వలేదన్నారు. కేంద్రం ఇచ్చే ఫసల్ భీమా పథకం కూడా అమలు చేయడం లేదని ఫైర్ అయ్యారు ఈటల. వాగుల మీద చెక్ డ్యామ్స్ కట్టండి.. కానీ సైంటిఫిక్ గా కట్టండి. ముంపు లేకుండా చూడండని అన్నారు ఈటల. సదర్ మాట్ కాలువకు మూడు దిక్కుల గండి పడి 12 వేల ఎకరాలు కొట్టుకుపోయిందన్నారు. రెడ్ అలెర్ట్ ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకోవడం కాదన్న ఈటల.. ప్రజలను అప్రమత్తం చేయండన్నారు. అలా చేసి ఉంటే మోరంచాపల్లి గ్రామంలో  నలుగురు ప్రాణాలు కోల్పోయేవారు కాదన్నారు.

కిషన్ రెడ్డి హెలికాప్టర్ పంపించిన తరువాత కానీ, రాష్ట్ర ప్రభుత్వం స్పందంచలేదని ఆయన విమర్శించారు. పశ్ర మండలంలో ఒకటే కుటుంబంలో ఏడుగురు కాలువలో కొట్టుకుపోయారన్నారు. రిలీఫ్ క్యాంప్ లలో బాధితులకు కనీసం భోజనం కూడా పెట్టడం లేదన్నారు. మంత్రులు అధికారాలు లేక ఉత్త చేతులతో వరద బాధితుల దగ్గరికి వస్తున్నారని.. తక్షణ అవసరాల కోసం సహాయం అందించడం లేదన్నారు.  వరద ప్రభావిత ప్రాంతంలో బాధితులు కట్టు బట్టలతో మిగిలిపోయారన్నారు. ఇళ్లలో సామాను కొట్టుకుపోయిన వారికి ఒక్కో ఇంటికి 25 వేల రూపాయలు ప్రభుత్వం తక్షణమే ఇవ్వాలని.. వెంటనే సర్వే చేయించాలని ఈటల డిమాండ్ చేశారు.

ఇల్లు కూలిపోయిన వారికి 5 లక్షల రూపాయలు డబుల్ బెడ్ రూం కింద అందించాలన్నారు. వరదలకు శాశ్వత పరిష్కార చర్యలు ప్రభుత్వం చేపట్టాలన్నారు. వాగుల మీద కరకట్టల నిర్మాణం జరగాలన్నారు. కోత వేయబడ్డ భూములను ప్రభుత్వమే బాగు చేయాలని.. ప్రాజెక్ట్ పక్కన, ముంపుకు గురి అవుతున్న భూములన్నింటిని సేకరించి నష్ట పరిహారం అందించాలని ఈటల డిమాండ్ చేశారు.

ఢిల్లీలో అమిత్ షాను కలిసి వరద అంచనా వేసి ఆదుకోవాలి అని విజ్ఞప్తి చేయగానే.. నిపుణుల కమిటీని పంపించారన్నారు. ఇక తర్వలోనే వరదల మీద బీజేపీ  రిపోర్ట్ తయారు చేసి రాష్ట్రానికి, కేంద్రానికి అందిస్తామని ఈటల అన్నారు. వరదల్లో ఇబ్బంది పడుతున్న వారికి బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆసరాగా ఉండాలని ఈటల పిలుపునిచ్చారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు