రక్షా బంధన్ సందర్భంగా పాఠశాలల్లో విద్యార్థులు రాఖీ, తిలకం లేదా మెహందీ ధరిస్తే శిక్షించరాదని బాలల హక్కుల సంఘం (NCPCR) పాఠశాలలను ఆదేశించింది. బాలల హక్కుల పరిరక్షణ కోసం జాతీయ కమిషన్ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పాఠశాల విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలకు ఆదేశాలు జారీ చేసింది. లేఖలో, పిల్లలు వేధింపులకు వివక్షకు గురవుతున్నట్లు వివిధ వార్తా నివేదికల ద్వారా కమిషన్ గమనించింది. పండుగల సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు ఇతర సిబ్బంది ఈ రూల్‌ని పాటించాలని కోరింది.
"రక్షా బంధన్ పండుగ సందర్భంగా పాఠశాలల్లో పిల్లలకు రాఖీ లేదా తిలకం లేదా మెహందీ ధరించడాన్ని పాఠశాలలు అనుమతించడం, వారిని శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేయడం గమనించాము. రూల్ ప్రకారం పాఠశాలల్లో శిక్ష నిషేధించబడుతుందని గమనించగలరు" NCPCR తెలిపింది. సంబంధిత అధికారులకు అవసరమైన ఆదేశాలు జారీ చేయాలని కోరింది. పిల్లలను శారీరక వివక్షకు గురిచేసే ఎలాంటి అభ్యాసాన్ని పాఠశాలలు పాటించకుండా చూసుకోవాలని అభ్యర్థించాలని ఉన్నత బాలల హక్కుల సంఘం తెలిపింది.
మంచి నిర్ణయమే:
నిజానికి రక్షా బంధన్ రోజు చాలా రాష్ట్రాల్లోని స్కూల్స్‌కి హాలీడే ఉంటుంది. కొన్ని చోట్ల మాత్రం స్కూల్ రన్ అవుతుంది. అందులోనూ ఈ సారి రక్షా బంధన్ ఎప్పుడన్నదానిపై ప్రజల్లో కన్ఫ్యూజన్ ఉంది. ఈ నెల 30(ఇవాళ), రేపు(ఆగస్టు 31)న ముహూర్తం ఉందని పండితులు చెబుతున్నారు. కానీ రెండు రోజులు సెలవు ఇవ్వడం కరెక్ట్ కాదు.. అందుకే కొన్ని స్కూల్స్ ఒక రోజు హాలీడే ప్రకటించగా.. కొన్ని రాష్ట్రాల్లో మరికొన్ని స్కూల్స్ మాత్రం అసలు సెలవు ఇవ్వలేదు. ఈ క్రమంలోనే చేతికి రాఖీ కట్టుకోని స్కూల్స్‌కి వచ్చే పిల్లల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అటు బాలికలు సైతం తిలకం, మెహందీ పెట్టుకోని వస్తుంటారు. అయితే స్కూల్ యూనిఫామ్ రూల్స్ ప్రకారం కేవలం పాఠశాల యాజమాన్యం చెప్పిందే పాటించాలి. అందుకే విద్యార్థులను ఈ విషయంలో శిక్షిస్తారేమోనని బాలల హక్కుల సంఘం భావించి ఉండొచ్చు. గతంలోనూ సంప్రదాయాల విషయంలో స్కూల్ మ్యానేజ్‌మేంట్‌కి తల్లిదండ్రులకు ఇష్యూస్ అయ్యాయి. వీటిని గమినిస్తూ వచ్చిన NCPCR తాజాగా ఈ విధంగా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది.
ALSO READ: చేతికి ఏడు వేల రాఖీలు కట్టించుకున్న ఖాన్ సర్.. జూనీయర్ ఎన్టీఆర్ గుర్తొచ్చాడు భయ్యా!
Raksha Bandhan: స్కూళ్లకి కీలక ఆదేశాలు.. రాఖీ వేళ విద్యార్థులను ఆ విషయంలో శిక్షించొద్దు!
రక్షా బంధన్ సందర్భంగా పాఠశాలల్లో విద్యార్థులు రాఖీ, తిలకం, మెహందీలు కట్టుకుంటే శిక్షించరాదని బాలల హక్కుల సంఘం ఎన్‌సీపీసీఆర్(NCPCR) పాఠశాలలను కోరింది. పిల్లలను శారీరక దండన లేదా వివక్షకు గురిచేసే అలాంటి అభ్యాసాన్ని పాఠశాలలు పాటించకుండా చూసుకోవాలని అభ్యర్థించాలని ఉన్నత బాలల హక్కుల సంఘం తెలిపింది.
New Update
Advertisment