Washing Machine: వాషింగ్ మెషిన్ వాడే వారు.. ఈ తప్పులు అస్సలు చేయకండి

వాషింగ్ మెషీన్ వాడడం సింపుల్ అయినప్పటికీ చాలా మంది ఈ తప్పులు చేస్తుంటారు. మెషిన్ డోర్ ఎప్పుడూ క్లోజ్ చేయడం వల్ల తడి కారణంతో బ్యాడ్ స్మెల్, బ్యాక్టీరియా వస్తుంది. అలాగే సరైన క్లీనింగ్ లేకపోవడం, అధిక డిటర్జెంట్, ఎక్కువ బట్టలు వేయడం మెషిన్ త్వరగా పాడవడానికి కారణమవుతాయి.

New Update
Washing Machine: వాషింగ్ మెషిన్ వాడే వారు.. ఈ తప్పులు అస్సలు చేయకండి

Washing Machine: చాలా సంవత్సరాలుగా వాషింగ్ మెషిన్ వాడకం అలవాటు ఉన్నవారు కూడా.. కొన్ని సార్లు ఈ తప్పులు చేస్తుంటారు. ఈ చిన్న విషయాలు అంతగా గమనించకపోవచ్చు. కానీ ఇవి వాషింగ్ మెషిన్ ను అపరిశుభ్రం చేయడంతో పాటు వాటి లైఫ్ స్పాన్ కూడా తగ్గిస్తాయి. ముఖ్యంగా వాషింగ్ మెషిన్ వాడేటప్పుడు ఈ తప్పులు మాత్రం అస్సలు చేయకండి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

వాషింగ్ మెషిన్ డోర్ ఎల్లప్పుడూ తెరిచి ఉంచడం

సాధారణంగా బట్టలు వాష్ చేసిన వెంటనే డోర్ క్లోజ్ చేసి వెళ్లిపోవడం అందరికీ అలవాటు. కానీ ఇలా చేస్తే దాంట్లో బ్యాక్తీరియా ఫార్మ్ అవ్వడం, దుర్వాసన రావడం జరుగుతుంది. బట్టలు వాష్ చేసిన వెంటనే కాసేపు ఓపెన్ చేసి పెడితే దానిలో ఉన్న తేమ ఆవిరైపోతుంది. లేదంటే తడి కారణంగా బ్యాక్తీరియా చెడు వాసన వస్తుంది. ఫ్రంట్ లోడింగ్ మెషీన్స్ లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.

ఒకేవేళ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే డోర్ ఓపెన్ చేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు దాని లోపలి వెళ్లే ప్రమాదం ఉంటుంది. అందుకని డోర్ ఓపెన్ గా ఉన్నప్పుడు తగిన కేర్ తీసుకోవాలి.

Also Read: Pre Heating Foods: ఈ ఆహారాలు వేడి చేసి తింటున్నారా..? అయితే జాగ్రత్త

publive-image

మెషిన్ క్లీన్ చేయకపోవడం

మనం వాడేది మెషిన్ అయినప్పటికీ రెగ్యులర్ గా క్లీన్ చేస్తూ ఉండాలి. కొంత మంది చాలా కాలం వాటిని అలాగే వదిలేస్తారు. ఇలా చేస్తే మెషిన్ పాడయ్యే అవకాశం ఉంటుంది. మెషిన్ లోపల చిక్కుకున్న చెత్త, మురికిని తొలగించడానికి నీటిలో డిటర్జెంట్ బదులు 2 కప్పుల వెనిగర్ వేసి క్లీన్ చేస్తే శుభ్రంగా అవుతుంది. కనీసం నెలకు ఒకసారైనా చేస్తే మంచిది.

ఒకేసారి ఎక్కువ లోడ్ వేయడం

సహజంగా వాషింగ్ మెషిన్ పై వాటి కెపాసిటీ మెన్షన్ చేస్తారు. కానీ వీటిని గమనించకుండా.. ఓవర్ లోడ్ చేయడం వల్ల స్ట్రైన్ ఎక్కువై మోటర్ విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. అలాగే నీటిలో బట్టలు తిరగడానికి తక్కువ ప్లేస్ ఉండడంతో మెషిన్ సామర్థ్యం తగ్గిపోతుంది. దీంతో బట్టలు అపరిశుభ్రంగా బయటకు వస్తాయి.

సరైన డిటర్జెంట్ వాడకపోవడం

ప్రతీ వాషింగ్ మెషిన్ కు ప్రత్యేకమైన డిటర్జెంట్ మెన్షన్ చేసి ఉంటుంది. ఒకవేళ వాషింగ్ మెషిన్ పై లేకపోతే ఆన్లైన్ ద్వారా కనుక్కొని వాడాలి. అంతే కానీ సాధారణ సర్ఫ్ వాడితే అది బట్టల పై పేరుకుపోయి.. దానికి సంబందించిన చెత్త మెషిన్ లో ఉండిపోతుంది. అలాగే కొంత మంది ఎక్కువ సర్ఫ్ వేస్తే మరింత తెల్లగా మారుతాయని ఫీల్ అవుతారు. కానీ ఆలా వేయకూడదు. అక్కడ ఇచ్చిన నిష్పత్తిలో మాత్రమే డిటర్జెంట్ వాడాలి.

Also Read: Tan Removal Tips: ఇవి అప్లై చేస్తే.. ట్యాన్ తొలగిపోయి మెరిసే చర్మం మీ సొంతం

Advertisment
తాజా కథనాలు