Tan Removal Tips: ఇవి అప్లై చేస్తే.. ట్యాన్ తొలగిపోయి మెరిసే చర్మం మీ సొంతం

సాధారణంగా వింటర్ సీజన్ లో చర్మం ట్యాన్ అవ్వడం ఎక్కువగా జరుగుతుంది. ముఖం పై ట్యాన్ తొలగించడానికి ఇంట్లోనే ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే చాలు. అలోవెరా జెల్, పెరుగు- పసుపు, పాలు-తేనే, పొటాటో జ్యూస్, ఓట్ మీల్ మిశ్రమాలు అప్లై చేస్తే మంచి ఫలితాన్ని ఇస్తాయి. మీరు కూడా ట్రై చేయండి.

New Update
Tan Removal Tips: ఇవి అప్లై చేస్తే.. ట్యాన్ తొలగిపోయి మెరిసే చర్మం మీ సొంతం

Tan Removal Tips: సహజంగా అమ్మాయిలకు అందంగా కనిపించడం చాలా స్పెషల్. చర్మం కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉండడానికి రకరకాల బ్యూటీ ప్రాడక్ట్స్, చిట్కాలు వాడుతుంటాము. ముఖ్యంగా చలికాలం, వేసవి కాలంలో చర్మ నిగారింపుకు సంబంధించి చాలా సమస్యలు వస్తాయి. వాతావరణ మార్పుల కారణంగా, పొడిబారడం, ట్యాన్ అవ్వడం, జరుగుతుంది. ఇలాంటి సమస్యను చిటికెలో మాయం చేయడానికి ఇంట్లోనే తయారు చేసే ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే సరిపోతుంది. వీటిని ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం..

అలోవెరా జెల్

సాధారణంగా అలోవెరా జెల్ ముఖ సౌదర్యానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సన్ ట్యాన్ తో నల్లగా మారిపోయిన మొహం పై ఈ జెల్ అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. దీనిలోని యాంటీ ఇంఫ్లఅమేటరీ గుణాలు తొలగించడంలో మెరుగ్గా పని చేస్తాయి.

publive-imageపొటాటో జ్యూస్

పొటాటో ముక్కలతో తయారు చేసుకున్న రసాన్ని ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయాలి. ఆలులోని బ్లీచింగ్ గుణాలు ముఖం పై ట్యాన్ తొలగించడానికి ఉపయోగపడతాయి.

ఓట్ మీల్

చాలా మంది ట్యాన్ తొలగించడానికి ఓట్ మీల్ చిట్కా ట్రై చేసి ఉండరు. మజ్జిగలో ఓట్స్ వేసి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. తర్వాత ఆ మిశ్రమంతో మొహం ఒక పది నిమిషాల పాటు స్క్రబ్ చేయాలి. దీని వల్ల మెరిసే చర్మంతో పాటు స్కిన్ లోని డెడ్ సెల్స్ కూడా తొలగిపోతాయి.

పాలు , తేనే

పాలు, తేనే కలయిక సన్ ట్యాన్ తొలగించడానికి అద్భుతమైన చిట్కా. పాలలో కాస్త తేనే కలిపి ముఖానికి అప్లై చేయాలి. పాలలోని ల్యాక్టిక్ యాసిడ్ గుణాలు చర్మంలోని డెడ్ సెల్స్ తొలగించడానికి సహాయపడతాయి. అలాగే తేనెలో చర్మాన్ని తేమగా, మృదువుగా ఉంచుతుంది.

Also Read: Moong Dal Halwa: నోరూరించే పెసర పప్పు హల్వా.. సింపుల్ అండ్ ఈజీ

పాలు , తేనే

పాలు, తేనే కలయిక సన్ ట్యాన్ తొలగించడానికి అద్భుతమైన చిట్కా. పాలలో కాస్త తేనే కలిపి ముఖానికి అప్లై చేయాలి. పాలలోని ల్యాక్టిక్ యాసిడ్ గుణాలు చర్మంలోని డెడ్ సెల్స్ తొలగించడానికి సహాయపడతాయి. అలాగే తేనెలో చర్మాన్ని తేమగా, మృదువుగా ఉంచుతుంది.

publive-imageపెరుగు- పసుపు

పెరుగు - పసుపు కలిపిన మిశ్రమాన్ని ప్రభావిత ప్రాంతాల్లో అప్లై చేయాలి. పసుపులోని యాంటీ ఇన్ఫలమేటరీ గుణాలు మొహాన్ని కాంతివంతంగా చేస్తాయి. పెరుగు స్కిన్ ఎల్లప్పుడూ తేమగా ఉండడానికి సహాయపడుతుంది.

తేనే - నిమ్మరసం

కాస్త నిమ్మరసం తేనే కలిపి సన్ ట్యాన్ కారణంగా నల్లగా మారిన ప్రదేశాల్లో అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. నిమ్మకాయలోని సహజ బ్లీచింగ్ గుణాలు చర్మాన్ని ప్రకాశవంతంగా, మెరిసేలా చేస్తాయి.

Also Read: Pre Heating Foods: ఈ ఆహారాలు వేడి చేసి తింటున్నారా..? అయితే జాగ్రత్త

Advertisment
Advertisment
తాజా కథనాలు