Winter Life: చలికాలం(Winter Season) నడుస్తోంది. ఈ సమయంలో ప్రజలు దుప్పట్లు(Blanket) కప్పుకుంటారు. ఎందుకంటే దుప్పటి లేకపోతే నిద్రపట్టదు.. చలికి వణకాల్సి వస్తుంది. అయితే చాలామంది దుప్పటనిపై నుంచి కిందవరకు కప్పుకుంటారు. అప్పుడు ఫేస్ కూడా కవర్ ఐపోతుంది. ఇలా చేయకూడదు. ఇది శరీరానికి చాలా నష్టాన్ని కలిగిస్తుంది. ఈ కారణంగా ఊపిరి ఆడకపోవడం అతిపెద్ద సమస్యగా మారుతుంది. దీంతోపాటు శరీరంలో రక్తప్రసరణపై కూడా ప్రభావం పడుతుంది. నోటికి కప్పడం వల్ల ఆక్సిజన్ శరీరానికి చేరకపోవడం వల్ల ఇది జరుగుతుంది. చెడు ఆక్సిజన్ మాత్రమే శరీరంలోకి ప్రవేశిస్తుంది. నోరు మూసుకుని నిద్రపోవడం కూడా జీవక్రియను ప్రభావితం చేస్తుంది.
చర్మ సమస్యలు కూడా తప్పవు:
నోటిని కవర్ చేయడం వల్ల శరీరానికి సరైన మొత్తంలో ఆక్సిజన్ లభించదు. ఇది ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. ఊపిరాడకపోవడం లేదా గుండెపోటు వంటి పరిస్థితులను కూడా కలిగిస్తుంది. కొన్ని సందర్భాల్లో.. ఇది ఊపిరితిత్తుల సంకోచానికి కూడా కారణమవుతుంది. కాబట్టి దుప్పటిని నోటిపై మూసుకుని నిద్రపోకూడదు. చలికాలంలో ఇలా పడుకుంటే చర్మ సమస్యలు కూడా వస్తాయని డాక్టర్లు కూడా చెబుతున్నారు. లోపల ఉండే చెడు గాలి కారణంగా చర్మం నలుపు రంగులోకి మారడం ప్రారంభమవుతుంది. ఈ కారణంగా చర్మంపై దద్దుర్లు కూడా కనిపించడం ప్రారంభిస్తాయి.
ఆస్తమా, సిఓపిడి లేదా మరే ఇతర శ్వాసకోశ వ్యాధి ఉన్నవారు ఎప్పుడూ ఇలా నిద్రపోకూడదు. అలాంటి వారు ఇలా నిద్రపోవడం ప్రమాదకరం. ఆస్తమా లేదా ఇతర వ్యాధులతో బాధపడుతున్న రోగుల ఊపిరితిత్తులు బలహీనపడతాయి. ఇలా నిద్రపోతే ఆక్సిజన్ సరిగా అందదు.
ఇది కూడా చదవండి: పాడైపోయిన టూత్ బ్రష్‌ను పారేయవద్దు.. ఇలా యూజ్ చేస్తే చిటికిలో పనులు పూర్తి!
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: పాలకూర తింటే ఎన్నో ప్రయోజనాలు.. అవేంటో తెలుసుకోండి!