Virat: ప్లీజ్ నన్ను అలా పిలవొద్దు.. అభిమానులకు కోహ్లీ రిక్వెస్ట్!

అభిమానులు, సహచరులకు విరాట్ కోహ్లీ ఓ రిక్వెస్ట్ చేశాడు. తనను కింగ్ అని పిలవొద్దని కోరాడు. 'కింగ్ అని పిలిస్తుంటే చాలా అసౌకర్యంగా అనిపిస్తోంది. నన్ను విరాట్ అని పిలిస్తే చాలు.. నన్ను అలా పలకరిస్తే ఇబ్బంది పడుతున్నా' అని చెప్పాడు.

New Update
Virat: ప్లీజ్ నన్ను అలా పిలవొద్దు.. అభిమానులకు కోహ్లీ రిక్వెస్ట్!

Virat Kohli: టీమ్ ఇండియా స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) అభిమానులు, సహచరులకు ఓ రిక్వెస్ట్ చేశాడు. అందరూ తనను కొంతకాలంగా కింగ్ కోహ్లీ అని పిలుస్తున్న విషయం తెలిసిందే. కాగా రీసెంట్ ఇంటర్వ్యూలో దీనిపై ప్రత్యేకంగా మాట్లాడిన కోహ్లీ తనను కింగ్ అని పిలవొద్దని చెప్పాడు.

సింగిల్ టైటిల్‌ను డబుల్ చేస్తాం..
ఈ మేరకు ఆర్సీబీ కెప్టెన్లు ఫాఫ్‌ డుప్లెసిస్‌, స్మృతి మంధానతో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న విరాట్.. ఈ సారి తమ ఫ్రాంచైజీ సాధించిన సింగిల్ టైటిల్‌ను డబుల్ చేస్తామనే నమ్మకం ఉందని చెప్పాడు. అలాగే ‘ఆర్సీబీ మహిళల జట్టు ఛాంపియన్‌గా నిలవడం చాలా ఆనందంగా ఉంది. మేము కూడా ఈసారి విజేతగా నిలుస్తామనే నమ్మకంతో ఉన్నాం. సింగిల్ టైటిల్‌ను డబుల్‌ చేస్తే మరెంతో ప్రత్యేకమవుతుంది. ఫస్ట్ మ్యాచ్‌లో సీఎస్కేతో తలపడనున్నాం. మాకు ఎక్కువ సమయం లేదు' అన్నాడు.

ఇది కూడా చదవండి: IPL: RCB పేరు మార్పు.. ఈసారైనా అదృష్టం వరించేనా!?

‘కింగ్‌’ అంటే ఇబ్బందిగా ఉంటుంది..
అలాగే అభిమానులకు ఒక విజ్ఞప్తి చేశాడు. 'నన్ను ‘కింగ్‌’ అనే పదంతో పిలవడం ఆపేయండి. ఇలాంటి పదంతో పిలిస్తుంటే చాలా అసౌకర్యంగా అనిపిస్తోంది. నన్ను విరాట్ అని పిలిస్తే చాలు. ఇప్పటికే మా కెప్టెన్ ఫాఫ్‌ డుప్లెసిస్‌కు చెప్పాను. ప్రతి ఏడాది సీజన్‌ సమయంలో అలాంటి పిలుపుతో ఇబ్బంది పడుతున్నా. విరాట్ కోహ్లీగానే పిలవండి' అని రిక్వెస్ట్ చేశాడు. ఇక ఐపీఎల్ టైటిల్‌ సాధించాలనేది తన కల అని.. ఈసారి ఎలాగైనా కప్ సాధించేందుకు కష్టపడతానని అన్నాడు. జట్టు విజయం కోసం, అభిమానుల కోసం తన అనుభవాన్ని మొత్తం ఉపయోగిస్తానన్నాడు. ఈ 17వ సీజన్‌ తొలి మ్యాచ్‌లో మార్చి 22న చెన్నై సూపర్ కింగ్స్‌తో మొదటి మ్యాచ్ ఆడనుంది ఆర్సీబీ.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు