సీఎం కేసీఆర్‌ మోసపు మాటలు నమ్మొద్దు: రైతాంగానికి ఈటల విజ్ఞప్తి

ప్రధాన మంత్రి కృషి సంవృద్ది కేంద్రాల ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా షాద్‌నగర్‌లో ఎమ్మెల్యే, బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. షాద్‌నగర్ బస్టాండ్ వద్ద ఉన్న గణేష్ అగ్రో ఏజెన్సీలో ఏర్పాటు చేయగా.. కోట్లమంది రైతులకు ప్రయోజనం చేకూరే కార్యక్రమాలు చేపడుతున్నామని ఈటల అన్నారు.

New Update
సీఎం కేసీఆర్‌ మోసపు మాటలు నమ్మొద్దు: రైతాంగానికి ఈటల విజ్ఞప్తి

18 వేల కోట్లు ఈ రోజు రైతుల అకౌంట్స్‌లో జమ అయ్యింది. ఈరోజు లక్షా 25 వేల కిసాన్ సమృద్ది (Kisan Abundance) కేంద్రాలు ప్రారంభించారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్ల తరువాత రైతుల బాధలు, దుఖాన్ని అర్థం చేసుకొనే ప్రభుత్వం వచ్చింది. వారి మేలు కోసం ఈ ప్రభుత్వం పని చేస్తోందని ఈటల అన్నారు. ఈ పథకం ద్వారా కోట్ల మంది రైతులకు వారి భూమికి భూసార పరీక్షలు చేస్తున్నాం. కిసాన్ సమృద్ది కేంద్రాలు ఒన్ స్టాప్ సెంటర్. రైతులకు అవసరం అయిన అన్ని వస్తువులు ఇక్కడే దొరుకుతాయి. ఇంకా 1 లక్ష 75 వేల ప్రధాన మంత్రి కృషి సంవృద్ది కేంద్రాలు త్వరలో ఏర్పాటు చేస్తమన్నారు.

రైతులకు సబ్సిడీ  

ప్రపంచ మార్కెట్లో ఎరువుల ధర పెరిగినా మన దేశంలో పెరగకుండా రైతులకు సబ్సిడీ(Subsidy to farmers) మీద ఎరువులు అందిస్తున్నారు. యూరియా: 2503 రూపాయలు ఉంటే 2236 రూపాయల సబ్సిడీ ఇచ్చి రైతులకు 267 రూపాయలకు అందిస్తోందన్నారు. DAP3711 రూపాయలు ఉంటే 2422 రూపాయల సబ్సిడీ ఇచ్చి 1300 రూపాయలకే ఇస్తున్నారు.  మోదీ చెప్పినట్టు అమెరికాలో యూరియా 3 వేల రూపాయలు, పాకిస్థాన్‌లో 800, బంగ్లాదేశ్‌లో 720 లకు అందిస్తుంటే మన దేశంలో 267 రూపాయలకే అందిస్తున్నారు. యూరియా, DAP, 20-20 సంవత్సరానికి ఒక ఎకరానికి 20 వేల రూపాయల సబ్సిడీ ఇవ్వాగా.. 6 వేల రూపాయలు ప్రతి ఎకరానికి సమ్మాన నిధి కింద ఇస్తున్నాం అన్నారు. కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే 5 పైసలు ఇవ్వని సీఎం కేసీఆర్‌ మన డబ్బులు తీసుకెళ్ళి వేరే రాష్ట్రంలో ఇవ్వడం సిగ్గుచేటు అన్నారు.

కేసీఆర్ మోసం చేశారు

భారత ప్రభుత్వం పంట నష్టం కోసం ఫసల్ భీమా యోజన స్కీమ్ తీసుకువస్తే రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన వాటా కట్టక పోవడం వల్ల పంట నష్టం డబ్బులు రావడం లేదు. హెలికాప్టర్‌లో వెళ్ళి అకాల వర్షాలవల్ల పంట నష్టపోయిన వారికి 10 వేల ఇస్తా అని చెప్పి ఇయ్యకుండా మోసం చేశారని మండిపడ్డారు. రైతులరా ఇది ఆలోచన చేయండని ఈటల విజ్ఞప్తి చేశారు. ఒక చేత్తో ఐదు వేలు ఇచ్చి ఇంకో చేత్తో ఆ డబ్బులు కేసీఆర్‌ లాక్కుంటున్నాడని ఈటల వ్యాఖ్యనించారు.పేరుకే రైతు ప్రభుత్వం తప్ప చేతల్లో లేదన్నారు. కేంద్రం వల్ల 422 కోట్ల రూపాయలు రంగారెడ్డి జిల్లా (Ranga Reddy District) రైతులకు అందిందని.. ప్రజల ఆశీర్వాదంతో గెలిపిస్తే రైతులకు కన్నీళ్లు లేకుండా చేస్తమన్నారు. కౌలు రైతులకు భద్రత కలిపిస్తమని.. సబ్సిడీ విత్తనాలు, ఎరువులు ఇంప్లిమెంట్ ఇస్తాం అని హామీ ఇస్తున్నామని ఈటల (etala)తెలిపారు. రైతులు బాగుంటే పల్లెలు, పల్లెలు బాగుంటేనే రాష్ట్రం, రాష్ట్రాలు బాగుంటేనే దేశం బాగుంటుందని గాంధీజీ (Gandhiji) చెప్పినట్టు గ్రామస్వరాజ్యమే మా లక్షం అని ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) ఈ రోజు మరోసారి ప్రకటించారు. మేము వస్తే నిజమైన రైతురాజ్యం తీసుకువస్తాం. కేసీఆర్‌ మోసపు మాటలు నమ్మవద్దు అని రైతాంగాన్ని కోరుతున్నానని ఈటల అన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు