Kerala Bomb Blast: అది తట్టుకోలేకే క్రిస్టియన్ సంస్థపై బాంబు దాడి.. నిందితుడి వీడియో వైరల్ .!

యెహోవా సాక్షుల సంస్థ తన సభ్యుల మెదళ్లలో విద్వేషాలు నింపుతోందని.. దేశ భక్తిని దెబ్బతీస్తోందని నిన్న కేరళలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ కు కారణమైన నిందితుడు తెలిపాడు. దాన్ని అడ్డుకోవడం కోసమే బాంబు దాడి చేశానన్నారు. అతను పోలీసులకు లొంగిపోకముందు రికార్డు చేసిన వీడియో వైరల్ గా మారింది.

New Update
Kerala Bomb Blast: అది తట్టుకోలేకే క్రిస్టియన్ సంస్థపై బాంబు దాడి.. నిందితుడి వీడియో వైరల్ .!
Kerala Bomb Blast Blast Updates: కన్వెన్షన్ సెంటర్ లో బాంబు పెట్టింది తానేనని డొమినిక్ మార్టిన్ (Dominic Martin) అనే వ్యక్తి కేరళలోని త్రిసూర్ జిల్లా కొడకరా పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. ప్రస్తుతం డొమినిక్ మార్టిన్ ను పోలీస్ అధికారులు విచారిస్తున్నారు. అతడి సొంత ప్రాంతం కొచ్చి అని తెలుస్తోంది. అయితే, దాడి చేసిన తర్వాత నిందితుడు డొమినిక్ మార్టిన్ ఓ వీడియోను రికార్డు చేశాడు.ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో అతను ఎందుకు ఆ బాంబు దాడులు చేయాల్సి వచ్చింది అనే విషయాలను వివరించాడు.

Also Read: రాయగడ-పలాస రైలు ప్రమాదానికి కూడా కారణం కవచ్ సిస్టమే లేకపోవడమే.

ఆ వీడియోలో మాట్లాడుతూ " నా పేరు డొమినిక్ మార్టిన్. మీరు వినే ఉంటారు కేరళలోని కొచ్చిన్ కన్వెన్షన్ సెంటర్ (Kochi Convention Centre) లో బాంబు పేలుళ్ల గురించి. అయితే, ఈ వీడియో నేను ఎందుకు రికార్డ్ చేస్తున్నానంటే..ఈ దాడులు నేను ఎందుకు చేశానో మీకు తెలియాలి. అందుకు ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. నేను 16 సంవత్సరాలుగా యెహోవా సాక్షుల సంస్థలో ఒక మెంబర్ ని. కానీ, నేను ఎప్పుడు ఆ సంస్థలోని కొన్ని సమస్యలను సీరియస్‌గా చూడలేదు. అయితే, గత ఆరేళ్లలో నేను ఈ సంస్థ తప్పులను గ్రహించాను. వారు చాలా సమస్యాత్మకమైన భావనను ప్రచారం చేస్తూ.. బోధిస్తున్నారని తెలుసుకున్నాను. జాతీయ గీతాన్ని పలకవద్దని.. పెద్దయ్యాక ఓటు వేయకూడదని..సైన్యంలో పనిచేయ వద్దని..ఇలా చాలా తప్పుగా ప్రచారం చేస్తూ..బోధిస్తున్నారు. వారి సంఘం సభ్యులు తప్పా.. భూమిపై ఉన్న ప్రతీ ఒక్క మానవుడు నశిస్తాడని వారు నమ్ముతారు. వారి తల్లిదండ్రులు ఇంత చిన్న వయస్సులో పిల్లల మెదడులోకి అలాంటి విషాన్ని నింపుతున్నారు.

ఆ సంస్థ వారి మార్గాలను మార్చుకోవాలని కోరాను. ఎన్నో సార్లు అభ్యర్థించాను. కానీ వారు పట్టించుకోలేదు. ఒక సంస్థ గురించి మనం ఏమి చేయగలం. ఆ సంస్థలో వారు పిల్లలకు బోధించేవి 850 కోట్ల మానవుల నాశనాన్ని కోరుకుంటుంది. నేను ఆ సంస్థ చేసే వాటిని ఎలా అడ్డుకోవాలి ? అని ఎంతో ఆలోచించాను. కానీ నాకు ఎటువంటి పరిష్కారం దొరకలేదు. కానీ, ఎలాగైనా వాటిని అడ్డుకోవాలని అనిపించేది. అందుకు ఇలా బాంబు దాడులు చేశాను" అంటూ ఆ వీడియోలో తెలిపాడు.

కేరళలోని ఓ కన్వెన్షన్ సెంటర్​లో భారీ పేలుడు సంభవించి ఒకరు మరణించారు. ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటనలో 40 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో పది మంది తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎర్నాకులంలోని కాళామస్సేరీలో ఉన్న జమ్రా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. 2000వేల మందికిపైగా పాల్గొన్న ఓ మతపరమైన కార్యక్రమం​ జరుగుతున్న సమయంలో పేలుడు సంభవించింది.  ఈ ఘటనకు సంబంధించిన నిందితుడు డొమినిక్ మార్టిన్ తను చేసిన తప్పును ఒప్పుకున్నాడు. త్రిసూర్ జిల్లా కొడకరా పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. తానే కన్వెన్షన్ సెంటర్ లో బాంబు బ్లాస్ట్ చేసినట్లు పోలీసులకు సాక్ష్యాలు కూడా సమర్పించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతని వాదనలను పరిశీలిస్తున్నారు కేరళ పోలీసులు.

Also Read: అది తట్టుకోలేకే క్రిష్టియన్ సంస్థపై బాంబు దాడి.. నిందితుడి వీడియో వైరల్ .!

Advertisment
తాజా కథనాలు