తిరుపతికి చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ డాలర్స్ గ్రూప్ 10వ వార్షికోత్సవ సంబరాలు చంద్రగిరిలో ఘనంగా జరిగాయి. డాలర్స్ గ్రూపు అధినేత, యువ నాయకుడు దివాకర్ రెడ్డి జ్యోతి ప్రజ్వళన చేసి కార్యక్రమం ప్రారంభించారు. వైసీపీ, టీడీపీ, బీజేపీ, వామపక్ష పార్టీలకు చెందిన నేతలు పెద్ద సంఖ్యలో ఈ వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా జబర్దస్త్ టీంతో ఏర్పాటుచేసిన కామెడీ షో సభికులను అలరించింది. గడిచిన పదేళ్లుగా అంచలంచలుగా ఎదిగిన డాలర్స్ గ్రూప్ ఈ స్థాయికి చేరిందని దివాకర్ రెడ్డి తెలిపారు. ఈ ప్రయాణంలో కస్టమర్ల నుంచి చిన్న ఫిర్యాదు కూడా లేకుండా తమ సంస్థ ముందుకు వెళ్తుందని గుర్తు చేశారు. వ్యాపారంలో ముందుకు వెళ్లడమే కాకుండా నిరంతరం సేవా కార్యక్రమాల్లోనూ డాలర్స్ గ్రూప్ ముందుంటుందని వివరించారు.
ప్రస్తుతానికి రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని.. ప్రజలు, శ్రేయోభిలాషులు ఆశిస్తే భవిష్యత్తులో నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. అన్ని పార్టీల నుంచి తనకు ఆహ్వానం అందిందన్నారు. ఈ కార్యక్రమం నిర్వహణలోనూ ఎన్నో బెదిరింపులు ఎదురయ్యాయని, తాను వాటిని పట్టించుకునే వ్యక్తిని కాదని చెప్పారు. ఇప్పటివరకు రాజకీయాలకు సంబంధం లేకుండానే ముందుకు వెళుతున్నానని దివాకర్ రెడ్డి వెల్లడించారు.