రోజంతా గంటలతరబడి పనిచేయడమే కాదు..శరీరానికి కావాల్సినంత విశ్రాంతి ఇవ్వడం చాలా ముఖ్యం. విశ్రాంతి తీసుకున్నప్పుడే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. గుండె శరీరం అంతటా రక్తాన్ని సరఫరా చేసే అవయవం. గుండె అలసిపోయి విరామం తీసుకున్నట్లయితే..మనిషి శాశ్వత నిద్రలోకి జారుకున్నట్లే. కాబట్టి గుండెను ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.
నేటి కాలంలో చాలా మంది గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్ వంటి సమస్యలతో బాధపడుతున్నారు. 20ఏళ్లకే గుండెపోటుతో కుప్పకూలుతున్నారు. శరీరానికి శ్రమ లేకుండా నిశ్చలమైన లైఫ్ స్టైల్, అనారోగ్యకరపు ఆహార అలవాట్లు, ధూమపానం, ఆల్కాహాల్ సేవించడం, ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి ఇవన్నీ కూడా గుండెపనితీరుపై భంగం కలిగిస్తున్నాయి.
గుండె ఆరోగ్యం కోసం యోగాసనాలు:
వివిధ రకాల యోగాసనాలు ఒక్కో వ్యాధికి ఉపశమనాన్ని అందిస్తాయి. అదేవిధంగా, కొన్ని యోగాసనాలు కూడా మన గుండె జబ్బులకు చాలా ప్రభావవంతమైన ఉపశమనాన్ని అందిస్తాయి. ఈ కథనంలో మన శరీర రక్త ప్రసరణను, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే యోగాసనాల గురించి తెలుసుకుందాం.
తడసానా:
ఈ ఆసనం.. మన గుండెకు ఆక్సిజన్ అందించి, రక్త ప్రసరణను మెరుగుపరిచి, మన శరీరాన్ని సమతుల్యం చేస్తుంది. ఈ యోగాసనాన్నివేయడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం పెరిగి గుండె సంబంధిత వ్యాధులు తగ్గుతాయి.
సేతుబంధాసనం:
ఇది ఛాతీని విస్తరించి, మీ గుండె కండరాలను బలపరిచే యోగాసనము. మీరు వెనుకకు వంగినప్పుడు, మీ వీపు, తుంటి, వెన్నుపాము అన్నీ బలపడతాయి. ఇది మీ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
వృక్షాసనం:
ఈ యోగాసనం చేయడం వల్ల మీ శరీర సమతుల్యతను కాపాడుకోవచ్చు. ఇది అధిక రక్తపోటు, మీ శ్వాస సమస్యలను తగ్గిస్తుంది. గుండె వేగాన్ని అదుపులో ఉంచే యోగాసనం ఇది.
ఈ యోగాసనాలు వేసే ముందు నిపుణుల అభిప్రాయం తీసుకోండి:
మీ గుండె ఆరోగ్యం కోసం మీరు కొత్తగా యోగాసనాన్ని వేస్తున్నట్లయితే… ముందుగా మీ ఆరోగ్యాన్ని పరీక్షించుకోండి. ఆపై ఆరోగ్య నిపుణుడి నుండి సమాచారం తీసుకుని…యోగా నిపుణుల అభిప్రాయాన్ని కూడా తీసుకోండి. మీ ప్రస్తుత రక్త స్థాయిని, మీ మానసిక ఒత్తిడిని, మీ నిద్ర నాణ్యతను పరిశీలించి, తగిన యోగాసనాన్ని మీకు సలహా ఇస్తారు. మీకు గుండె సమస్య ఉన్నట్లయితే, యోగా ఆసనాలను చేర్చుకునే ముందు యోగా నిపుణుల నుండి మంచి అభిప్రాయం చాలా ముఖ్యం.