Dogs Cry: కుక్కలు రాత్రి పూట దెయ్యాలను చూసే ఏడుస్తాయా?..అసలు కారణం కుక్కలు ఆత్మలు లేదా దెయ్యాలను చూడగలవని ఒక మూఢనమ్మకం కూడా ఉంది. కానీ సైన్స్ అలాంటి వాటిని నమ్మదు. కుక్కలు పాత ప్రాంతం నుంచి కొత్త ప్రాంతానికి వచ్చినప్పుడు లేదా దారితప్పినప్పుడు వాటి హృదయాలు కూడా బాధగా ఉండి ఏడ్చేందుకు కారణమంటున్నారు. By Vijaya Nimma 22 Apr 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Dogs Cry: కుక్కలు ఆత్మలను చూడగలవని చాలా మంది నమ్ముతారు. ఈ కారణంగా అవి రాత్రిపూట బిగ్గరగా ఏడవడం లేదా మొరుగడం చేస్తాయని చెబుతారు. దీని వెనుక ఏదైనా శాస్త్రీయ కారణం ఉందా?.. మన జీవితంలో మనం కొన్ని విషయాలను యథాతథంగా చూశాం. ఉదాహరణకు అర్ధరాత్రి నిశ్శబ్దంగా ఉన్నప్పుడు కుక్క ఏడుపు లేదా బిగ్గరగా మొరిగే శబ్దం రావడం ప్రారంభమవుతుంది. దీని వల్ల నిద్రకు ఆటంకం కలగడమే కాకుండా గుండె కూడా ఆగినంత పని అవుతుంది. కుక్క ఏడుపు శబ్దం బాధాకరంగా ఉంటుంది. చెడు శకునము కూడా ఉందని అంటుంటారు. రాత్రిపూట కుక్క ఏడుస్తుంటే అది రాబోయే చెడు కాలాలకు సంకేతమని నమ్మరం. కుక్కలు ఆత్మలు లేదా దెయ్యాలను చూడగలవని ఒక మూఢనమ్మకం కూడా ఉంది. అర్ధరాత్రి దెయ్యం చూసి ఏడుపు, కేకలు పెట్టడానికి కారణం ఇదే అంటుంటారు. సైన్స్ అలాంటి వాటిని నమ్మదు. రాత్రి కుక్కలు ఏడ్చేందుకు వేరే కారణం ఉందంటున్నారు. మనుషులను ఆకర్షించేందుకు కుక్కలు ఏడుస్తూ అరుస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. పాత ప్రాంతం నుంచి కొత్త ప్రాంతానికి వచ్చినప్పుడు లేదా దారితప్పినప్పుడు వాటి హృదయాలు కూడా బాధగా ఉంటాయి. అర్ధరాత్రి అవి వాటి మంద నుంచి విడిపోయి ఏడవడం ప్రారంభిస్తాయని అంటున్నారు. ఏదో తప్పు జరగబోతోందని ప్రజలు భావించడానికి ఇదే కారణం. కుక్క గాయపడినా లేదా బాగోలేకపోయినా అవి కూడా ఏడుస్తాయి. రాత్రిపూట ఒంటరిగా అనిపించినప్పుడు ఏడుస్తున్నాయి. దగ్గరి వ్యక్తులు దూరం అయినా బాధపడుతుంటాయని నిపుణులు అంటున్నారు. ఇది కూడా చదవండి: పిల్లలు భోజనం చేసేటప్పుడు ఈ తప్పులు చేయకుండా చూసుకోండి గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. #dogs-cry మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి