Vistara air lines: రన్‌ వే పై వీధి కుక్క..ల్యాండ్‌ అవ్వకుండా వెనుదిరిగిన విమానం!

రన్‌ వే పైకి ఓ వీధికుక్క అడ్డు రావడంతో విస్తారా ఎయిర్‌ లైన్స్‌ కి చెందిన విమానం గోవాలోని దబోలిమ్‌ ఎయిర్‌ పోర్ట్‌ లో ల్యాండ్‌ అవ్వకుండా వెనుదిరిగింది.

Vistara air lines: రన్‌ వే పై వీధి కుక్క..ల్యాండ్‌ అవ్వకుండా వెనుదిరిగిన విమానం!
New Update

గోవాలోని దబోలిమ్‌ ఎయిర్‌ పోర్ట్ (Airport) లో అనుకోని సంఘటన ఒకటి జరిగింది. ఒక్కసారిగా వీధి కుక్క రన్‌ వే పైకి రావడంతో ఓ విమానమే వెనుదిరిగి వెళ్లాల్సి వచ్చింది. విమానాశ్రయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. విస్తారా ఎయిర్‌ లైన్స్‌ కు చెందిన యూకే 881 ఫ్లైట్‌ కర్ణాటక రాజధాని బెంగళూరు లోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సోమవారం మధ్యాహ్నం 12: 55 కి బయల్దేరింది.

ఆ ఫ్లైట్ 2 గంటలకు గోవా(Goa) లోని దబోలిమ్‌ విమానాశ్రయంలో ల్యాండ్‌ అవ్వాల్సి ఉంది. కానీ ల్యాండ్‌ అవ్వకుండానే వెనుదిరిగి వెళ్లింది. దీనికి కారణం అక్కడ వాతావరణం అనుకూలించక కాదు...విమానంలో సాంకేతిక లోపాలు తలెత్తడము కాదు...ఓ కుక్క. అవును ఓ కుక్క విమానాన్ని ల్యాండ్‌ అవ్వకుండా ఆపింది.

విమానం ల్యాండ్ అవ్వడానికి కొద్ది సేపు ముందు రన్‌ వే పై ఓ వీధి కుక్కనుఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌ అధికారులు గుర్తించారు. దీంతో వెంటనే పైలట్ ను అధికారులు అప్రమత్తం చేశారు. అలా కాసేపు ల్యాండ్‌ చేయకుండా పైలట్‌ ను ఆపినట్లు గోవా విమానాశ్రయం డైరెక్టర్‌ ఎస్వీటీ ధనుంజయరావు తెలిపారు.

కానీ కొద్ది సేపటి తరువాత విమానాన్ని బెంగళూరుకు దారి మళ్లించారు. 3.05 గంటల ప్రాంతంలో కెంపెగౌడ విమానాశ్రయంలో ల్యాండ్‌ చేశారు. విమానం మళ్లీ బెంగళూరు నుంచి 4.55 గంటలకు బయల్దేరి 6.15 కి గోవాకి చేరుకుంది. ఆ సమయంలో విమానంలో 100 మంది ప్రయాణికులు ఉన్నట్లు చెప్పారు. విమానం గోవాలో సురక్షితంగా ల్యాండ్‌ అయినట్లు వెల్లడించారు.

Also read: టీటీడీ ఉద్యోగులందరికీ ఇళ్ల స్థలాలు.. పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు

#vistara-air-lines #goa
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe