Anger: కోపంగా ఉన్నప్పుడు పేపర్‌ను చించితే కోపం తగ్గుతుందా..?

జపాన్‌ పరిశోధకులు కొత్త విషయాన్ని తెరపైకి తెచ్చారు. కోపంగా ఉన్నప్పుడు పేపర్‌పై కారణాలు రాసి చించేస్తే వెంటనే ఉపశమనం లభిస్తుందని అంటున్నారు. కోపాన్ని తగ్గించుకోవడానికి ఎన్ని మార్గాలున్నా ఈ విధానాన్ని ఒకసారి ట్రై చేసి చూడాలని, 100శాతం ఫలితం ఉంటుందని చెబుతున్నారు.

Anger: కోపంగా ఉన్నప్పుడు పేపర్‌ను చించితే కోపం తగ్గుతుందా..?
New Update

Anger: జపాన్‌లో నిర్వహించిన ఒక పరిశోధన ప్రకారం.. పేపర్‌లో ఏ విషయంపై కోపంగా ఉన్నారో రాసి చించేయడం వల్ల కోపాన్ని తగ్గించుకోవచ్చని అంటున్నారు. మనమందరం కోపంగా ఉంటాం. శాంతపరచడానికి వివిధ మార్గాల్లో ప్రయత్నిస్తాం. చాలా మంది ప్రజలు అవలంబించే ఒక ఆసక్తికరమైన పద్ధతి ఏమిటంటే తమ అసంతృప్తిని కాగితంపై రాసి దానిని చింపివేయడం. ఈ పరిశోధన నగోయా విశ్వవిద్యాలయంలో జరిగింది.

publive-image

ఈ ప్రయోగంలో సుమారు 100 మంది విద్యార్థులు పాల్గొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధించాలా వద్దా వంటి సామాజిక అంశాలపై విద్యార్థులు తమ అభిప్రాయాలను రాయాలని కోరారు. ఈ చేతిరాతలను డాక్టరల్ విద్యార్థిని మూల్యాంకనం చేయమని అడిగారు. అయితే విద్యార్థులు వారు రాసిన ప్రతిదానికీ తక్కువ మార్కులు వచ్చాయి. చేతిరాతను తక్కువ తెలివితేటలు, ఆసక్తి, స్నేహపూర్వకత, హేతుబద్ధత ఆధారంగా నిర్ణయించారు.

publive-image

పరిశోధన ప్రకారం విద్యార్థులు తమ కోపాన్ని కాగితంపై రాసి చించివేస్తే వారి కోపం దాదాపు పూర్తిగా మాయమైంది. అధ్యయనం ప్రధాన పరిశోధకుడు నోబుయుకి కవాయ్ మాట్లాడుతూ మా పద్ధతి కొంతవరకు కోపాన్ని తగ్గిస్తుందని అనుకున్నామని, కానీ కోపం పూర్తిగా పోవడం చూసి ఆశ్చర్యపోయామని చెప్పారు. ఇది కోపాన్ని నియంత్రించడానికి సులభమైన, సమర్థవంతమైన పరిష్కారమని ఈ ప్రయోగం రుజువు చేస్తుంది. కాబట్టి ఈసారి మీకు కోపం వచ్చినప్పునడు పేపర్‌పై కారణాలు రాసి చించేస్తే తగ్గుతుందని నిపుణులు అంటున్నారు.

ఇది కూడా చదవండి: కూరగాయలను అతిగా ఉడికిస్తున్నారా?.. జాగ్రత్త

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

#anger #paper
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe