Bad Fat: శరీరంలో చెడు కొవ్వు ఉంటే డిమెన్షియా పెరుగుతుందా..?

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే డిమెన్షియా అనే వ్యాధి వస్తుంది. దీని వల్ల దృష్టిలోపం సమస్య రావడంతో పాటు.. జ్ఞాపకశక్తి తగ్గుతుంది. ఈ వ్యాధిని కంట్రోల్ చేయాలంటే ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. మద్యపానానికి దూరంగా ఉండాలి. నిపుణులను సంప్రదించి వారి సూచనలు పాటించాలి.

New Update
Bad Fat: శరీరంలో చెడు కొవ్వు ఉంటే డిమెన్షియా పెరుగుతుందా..?

Bad Fat: ప్రస్తుత కాలంలో ఆహారాన్ని ఎంత కంట్రోల్ చేస్తే అంత ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. లేకపోతే అనేక వ్యాధులు మనల్ని జీవితాంతం వెంటాడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నేటి కాలంలో ఎక్కువగా వస్తున్న సమస్యల్లో గుండెపోటు, క్యాన్సర్, అనేక ఇతర వ్యాధులు చూస్తూనే ఉన్నాం. అయితే బయటి ఆహారాలపై ఎక్కువ శ్రద్ధ పెడితే కొన్ని సమస్యలు పెరుగుతాయి. వాటిలో కొవ్వు ఒకటి. మన శరీరంలో కొవ్వు రెండు రకాలుగా ఉంటుంది. మంచి కొవ్వు, చెడు కొవ్వు. శరీరానికి కొవ్వు అవసరమే కానీ చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ పెరిగితే మాత్రం రిస్క్‌తో పాటు అనేక రకాల రోగాలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కంటిచూపు కోల్పోయే అవకాశాలు:

ముఖ్యంగా ఇది గుండెపై, జ్ఞాపకశక్తిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని తాజాగా చేసిన సర్వేలో వెళ్లడైంది. ఈ చెడు కొలెస్ట్రాల్ డిమెన్షియా వంటి వ్యాధిని ఎక్కువగా పెంచుతుంది. దీనివల్ల దృష్టిలోపం సమస్య వచ్చే అవకాశం అధికంగా ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ చెడు కొలెస్ట్రాల్ 45 సంవత్సరాల వయసు ఉన్న వారిలో డిమెన్షియా ముప్పు ఏడు శాతంపైగా ఉంటుంది . ఆ తర్వాత వృద్ధాప్యలో రెండు శాతం కంటిచూపు కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. అంతేకాకుండా ఈ వ్యాధి వల్ల జ్ఞాపకశక్తి, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, అధిక రక్తపోటు, ఒబేసిటీ, డయాబెటిస్, అల్జీమర్స్‌ పెరగడం వంటి సమస్యలు ఈ చెడు కొలెస్ట్రాల్‌తో ముడిపడి ఉంది. కొన్ని సర్వేల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఐదు కోట్లకు పైగా డిమెన్షియా వ్యాధి ఎక్కువగా కేసులు నమోదవుతూ ఉన్నాయి. ఈ వ్యాధి 2050 సంవత్సరం నాటికి మరింత పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

దూరం చేయాల్సిన పదార్థాలు:

అయితే భారత్‌దేశంలో ఈ వ్యాధి 60 సంవత్సరాలు పైబడిన వారిలో 3 కోట్ల మంది డిమెన్షియాను ఎదుర్కొంటున్నట్లు నివేదికలో వెల్లడించారు. అయితే ఈ వ్యాధిని కంట్రోల్ చేయాలంటే ముఖ్యంగా ఆహారపు అలవాట్లు, మద్యపానం, జీవనశైలిలో మార్పు, ఫైబర్, విటమిన్లు, పోషకాలు లేని ఆహారం, జంక్‌ఫుడ్, అధిక చెక్కరలు వంటివి తీసుకోవడం వలన చెడు కొలెస్ట్రాల్ పెరిగి..ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. అయితే ఈ ఆహారాలను తినడం మానేస్తే డిమెన్షియాతో పాటు గుండె జబ్బుల నుంచి తప్పించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: ఈ 7 టిప్స్ పాటిస్తే మీ ఆఫీస్ లో మీరే కింగ్.. అవేంటో ఓ లుక్కేయండి!

Advertisment
తాజా కథనాలు