/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Does-babys-skin-turn-black-in-summer.-Follow-these-tips.jpg)
Children Skin Care: వేసవిలో పిల్లలకు చర్మ సంబంధిత సమస్యలు మొదలవుతాయి. దీనిని నివారించడానికి మీరు కొన్ని చిట్కాలను పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ఇది పిల్లలను ఆరోగ్యంగా ఉంచుతుందని సూచిస్తున్నాఉ. వేసవిలో పిల్లలను ఎండ నుంచి రక్షించడానికి మీరు కొన్ని చిట్కాలు ఉన్నాయి. వాటిని ఎలా అనుసరించలో.. వాటిపై కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
వేసవిలో పిల్లలకు చర్మ సంరక్షణ కోసం:
- వేసవిలో బలమైన సూర్యకాంతి కారణంగా.. పిల్లల చర్మం నల్లగా మారుతుంది. ఆ సమయంలో కొన్ని చిట్కాలను అనుసరించవచ్చు.
- పిల్లలు ఆడుకోవడానికి బయటకు వెళ్లినప్పుడల్లా.. మీరు వారి ముఖంపై SPF 30 లేదా అంతకంటే ఎక్కువ సన్‌స్క్రీన్‌ని అప్లై చేయవచ్చు. ఇది చర్మాన్ని కాపాడుతుంది.
- వేసవిలో.. పిల్లలకు కాటన్, వదులుగా ఉండే దుస్తులు ధరించాలి. ఇవి చెమటను పీల్చుకుంటాయి, క్యాప్స్, స్కార్ఫ్‌లను కూడా ఉపయోగించాలి.
- సాయంత్రం వేళల్లో పిల్లలను ఆరుబయట ఆడుకోవడానికి పంపితే.. బలమైన సూర్యకాంతిలో పంపితే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
- పిల్లల ముఖంపై మాయిశ్చరైజర్‌ను క్రమం తప్పకుండా వాడాలి. ఇది చర్మాన్ని తేమగా ఉంచుతుంది. చికాకును తగ్గిస్తుంది. ఈ చిట్కాల సహాయంతో మీరు పిల్లలను జాగ్రత్తగా చూసుకోవచ్చని నిపుణులు అంటున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: విష్ణువు విగ్రహం ముందు చిటికెడు పసుపు సమర్పించండి… మీ జీవితమే మారిపోతుంది!