బాలుడి కడుపులో ఆయస్కాంతాలు.. అవాక్కైన వైద్యులు

సాధారణంగా కడుపులో రాళ్లు, కత్తెరలు, ప్లాస్టిక్ వస్తువులను సర్జరీ చేసి తీయడం వంటి వార్తలు వింటూ ఉంటాం. కానీ ఏపీలో మాత్రం ఓ అరుదైన ఆపరేషన్ చేశారు వైద్యులు. బాలుడి కడుపులో ఆయస్కాంతాలు ఉండటం చూసి షాకయ్యారు. అయితే వాటిని విజయవంతంగా ఆపరేషన్ చేసి తొలగించారు.

New Update
బాలుడి కడుపులో ఆయస్కాంతాలు.. అవాక్కైన వైద్యులు

publive-image

షాక్ అయిన వైద్యులు.. 

అక్కడక్కడా కొంతమంది వైద్యులు ఆపరేషన్ చేసి కడుపులో సర్జరీ కత్తెరలు, కత్తులు వంటివి మర్చిపోతుంటారు. వాటిని గమనించకుండా అలాగే కుట్లు వేస్తూ ఉంటారు. తర్వాత పేషెంట్స్ తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ ఆసుపత్రుల చుట్టూ ప్రదర్శనలు చేస్తుంటారు. అనంతరం వారికి స్కానింగ్ చేసి లోపల ఉన్న వాటిని గుర్తించి ఆపరేషన్ చేసి బయటకు తీస్తారు. అలాగే కొన్ని చోట్ల సూదులు, పిన్నీసులు, రాళ్లు, పురుగులు, ప్లాస్టిక్ వస్తువులు ఇలా వివిధ మార్గాల ద్వారా కడుపులోకి వెళ్లిన వాటిని కూడా ఆపరేషన్ ద్వారా తొలగించిన ఘటనలు చూస్తూనే ఉన్నాం. కానీ తాజా ఘటన మాత్రం వైద్యులనే షాక్‌కు గురిచేసింది.

కడుపులో ఆయస్కాంతాలు.. 

ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన తొమ్మిది సంవత్సరాల బాలుడు మహమ్మద్ రఫీ.. విపరీతమైన కడుపునొప్పితో పాటు పరస వాంతులు చేసుకుంటూ బాధపడుతూ ఉండేవాడు. దీంతో తల్లిదండ్రులు గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించారు. బాలుడికి స్కానింగ్ చేసిన వైద్యులు షాకయ్యారు. కడుపులో నాలుగు ఆయస్కాంతాలు ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా అయస్కాంతాల ఆకర్షణకు పేగుల్లో పలుచోట్ల రంధ్రాలతో పాటు విత్తనాలు గమనించారు. అనంతరం వెంటనే ఆపరేషన్ చేసి వాటిని బయటకు తీశారు. అలాగే పాడైన పేగులను చికిత్స చేసి సాధారణ స్థితికి తీసుకువచ్చారు. ఆపరేషన్ విజయవంతం కావడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

పిల్లలు ఆడుకునేటప్పుడు జాగ్రత్త.. 

ఇలాంటి కేసులను చాలా అరుదని.. తాము చూడటం కూడా ఇదే తొలిసారి అని వైద్యులు తెలిపారు. కడుపునొప్పితో బాధపడుతున్న బాలుడికి స్కానింగ్ చేయగా ఆయస్కాంతాలు చూసి ఆశ్చపోయినట్లు పేర్కొన్నారు. పిల్లలు ఆడుకునేటప్పుడు కంటికి కనిపించిన వస్తువులను నోట్లో పెట్టుకుంటూ ఉంటారని.. అదే ఇప్పుడు పిల్లాడి ప్రాణాల మీదకు తెచ్చిందన్నారు. చిన్నపిల్లల విషయంలో పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలని.. బొమ్మలతో ఆడుకునేటప్పుడు వారిని గమనిస్తూ ఉండాలని సూచిస్తున్నారు. వస్తువులను నోట్లో పెట్టుకోకూడదని.. పెట్టుకుంటే ఏమైందో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో వారికి అర్థమయ్యేలా వివరించాలని వెల్లడించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు