Telangana: డీహెచ్ శ్రీనివాస్‌కు సీఎం షాక్.. కొత్త డైరెక్టర్‌గా డా.రవీంద్ర నాయక్..

తెలంగాణ హెల్త్ డైరెక్టర్‌గా గడ శ్రీనివాస్‌ను తొలగించింది ప్రభుత్వం. ఆయన స్థానంలో డాక్టర్ రవీంద్ర నాయక్‌ను హెల్త్ డైరెక్టర్‌గా నియమించింది. మెడికల్ ఎడ్యూకేషన్ డైరెక్టర్‌గా త్రివేణిని నియయించింది సర్కార్.

New Update
Telangana: డీహెచ్ శ్రీనివాస్‌కు సీఎం షాక్.. కొత్త డైరెక్టర్‌గా డా.రవీంద్ర నాయక్..

Telangana New Health Director: రాష్ట్రంలో కొలువుదీరిన రేవంత్ రెడ్డి సర్కార్ వివిధ శాఖలలోని ఉన్నతాధికారులను బదిలీ చేస్తోంది. ఇప్పటికే పలవురు ఐఏఎస్, ఐపీఎస్ లకు స్థానచలనం కల్పించిన ప్రభుత్వం.. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ గడల శ్రీనివాసరావు స్థానంలో డాక్టర్ రవీంద్ర నాయక్‌ను నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌గా డాక్టర్ రమేశ్ రెడ్డి స్థానంలో త్రివేణిని నియమించింది. కాగా డీహెచ్‌గా పనిచేసిన గడల శ్రీనివాసరావు గత ప్రభుత్వంతో సన్నిహితంగా మెలిగారనే ఆరోపణలున్నాయి. కొత్తగూడెం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయబోతున్నానని, కేసీఆర్ తనకు టికెట్ ఇస్తారని చివరి వరకు ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున నియోజకవర్గంలో పర్యటనలు చేస్తూ ప్రజలకు చేరువ అయ్యే ప్రయత్నాలు చేశారు. కానీ గులాబీ అధినేత టికెట్ నిరాకరించడంతో సైలెంట్ అయ్యారు. ఈ క్రమంలో అతడి వైఖరిపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తం కాగా తాజాగా రేవంత్ రెడ్డి సర్కార్ అతడికి స్థాన చలనం కల్పించింది. బుధవారం నాడు ఆయన విధుల నుంచి రిలీవ్‌ అయ్యారు. కొత్త డీహెచ్‌గా రవీంద్ర నాయక్‌ బాధ్యతలు స్వీకరించారు.

కొవిడ్‌ సమయంలో మెరుగైన సేవలు అందించాం..

ప్రజారోగ్య సంచాలకులుగా ఐదేళ్లకుపైగా సేవలందించి, తెలంగాణ ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కల్పించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో కోవిడ్‌‌ సమయంలో మెరుగైన వైద్య సేవలు అందించడంతోపాటు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడగలిగామన్నారు. వైరస్‌ కట్టడి కోసం అహర్నిశలు పని చేసి, సాధ్యమైనంత తక్కువ నష్టంతో రాష్ట్రాన్ని మహమ్మారి నుంచి కాపాడుకోగలిగామన్నారు. అందరి సహకారం వల్లే ఇది సాధ్యమైందని.. రానున్న రోజుల్లో తెలంగాణ ప్రభుత్వ సహకారంతో తెలంగాణ ప్రజారోగ్య రంగాన్ని మరింత పటిష్టం చేయడానికి పనిచేస్తానన్నారు. ఇంతకాలం తనకు సహకరించిన వివిధ జిల్లాల వైద్య అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి నమస్కారాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్న డాక్టర్లు..

శ్రీనివాసరావు కార్యాలయం నుండి వెళ్తుండగా కొందరు డాక్టర్లు కన్నీటి పర్యంతం అయ్యారు. ఆయనను హత్తుకుని డైరెక్టర్ కార్యాలయంలో పని చేసిన ఉద్యోగులు, సిబ్బంది ఏడ్చారు. కోవిడ్ కట్టడిలో సమర్థవంతంగా పని చేశారు అంటూ శ్రీనివాసరావుతో కన్నీటి పర్యంతమయ్యారు. కాగా.. ఆయన గుర్తుగా డాక్టర్ శ్రీనివాసరావుతో ఫొటోలు దిగేందుకు ఉద్యోగులు, డాక్టర్లు ఎగబడ్డారు.

Also Read:

ప్రతీ ‘పథకం’ సంచలనమే.. ఏపీ ప్రజలకు చంద్రబాబు ఎన్నికల వరాలు..

ప్రధాని కూడా అలాగే చేశారు.. ఎంపీ సంచలన కామెంట్స్..

Advertisment
తాజా కథనాలు