Ayodhya Ram Mandir: అయోధ్య రాముడి విగ్రహం కళ్లకు గంతలెందుకో తెలుసా..?

క్రతువులు, హోమాలు, పూజల ద్వారా విగ్రహంలో 50శాతం శక్తి వస్తుందని విశ్వాసం. విగ్రహం ప్రతిష్టించిన నేలలో యంత్ర విన్యాసం చేసిన అనంతరం ఆ శక్తి మరింత పెరగుతుంది. కళ్ల ద్వారా శక్తులు చొచ్చుకువెళ్తాయి. ప్రాణప్రతిష్ట వరకు కళ్లకు గంతలను విప్పరు.

Ayodhya Ram Mandir: అయోధ్య రాముడి విగ్రహం కళ్లకు గంతలెందుకో తెలుసా..?
New Update

Ayodhya Ram Mandir : అయోధ్య రామమందిరంలోని గర్భగుడిలో కొలువుదీరిన బాల రాముడి విగ్రహం కళ్లకు గంతలు కట్టి ఉండడం మీరు గమనించి ఉండవచ్చు. రామ్ లల్లా విగ్రహం కళ్లకు గుడ్డ ఎందుకు కట్టారు? దీని వెనుక కారణం ఏమిటి? తెలుసుకుందాం.

జనవరి 22వ తేదీ సోమవారం నాడు అయోధ్య రామ మందిరంలో జరగనున్న శ్రీరాముడి ప్రాణ ప్రతిష్టకు ముందుగా జనవరి 19వ తేదీ శుక్రవారం నాడు అయోధ్య రామాలయంలోని గర్భగుడిలో రామ్ లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. జనవరి 22న అయోధ్య రామమందిరంలోని గర్భగుడిలో రాముని విగ్రహానికి ప్రత్యేక పూజ - పునస్కారాలు నిర్వహించనున్నారు. రామమందిరంలో ప్రతిష్టించాల్సిన విగ్రహం కళ్లను గుడ్డతో కట్టారు. దీనికి కారణం ఏమిటి? విగ్రహం కళ్లకు ఎందుకు గంతలు కట్టారు?

విగ్రహం కళ్లకు గంతలెందుకు కడుతారు?
క్రతువులు, హోమాలు, పూజల ద్వారా విగ్రహంలో 50శాతం శక్తి వస్తుందని పండితులు చెబుతున్నారు. విగ్రహం ప్రతిష్టించిన నేలలో యంత్ర విన్యాసం చేసిన తర్వాత ఆ శక్తి మరింత పెరుగుతుంది. మంత్రోఛ్చారణ, పలు క్రతువుల ద్వారా విగ్రహానికి శక్తి లభిస్తుంది. విగ్రహంలోకి ఈ శక్తులు చొచ్చుకుపోయేలా చేస్తారు. విష్ణుకళలు, శక్తికళలు, చంద్రకళలు ,ఈశ్వరకళలు, సూర్య కళలు, మాతృకా కళలు, సాదశివ కళల ద్వారా విగ్రహంలోకి శక్తులను చొచ్చుకుపోయేలా చేస్తారని పండితులు అంటున్నారు. దీని కారణంగానే విగ్రహంలోకి శక్తి వస్తుందంటున్నారు.

అయితే విగ్రహం కళ్ల ద్వారా ఈ శక్తులు చొచ్చుకువెళ్తాయి. అప్పటివరకు విగ్రహప్రాణ ప్రతిష్ట వరకు విగ్రహం కళ్లకు గంతలను విప్పరు. విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన ముహూర్త సమయంలో విగ్రహం కళ్లకు ఉన్న గంతలను విప్పుతారు. ఆ సమయంలో నేరుగా విగ్రహం కళ్లను చూడకూడదని చెబుతారు. ఆవుకు ముందుగా విగ్రహాన్ని చూపుతారు లేదంటే అన్నం రాశిని విగ్రహం ముందు పెడతారు. ఈ పద్దతితో చేసిన పూజవిధానంలో విగ్రహానికి శక్తి వస్తుందని పండితులు అంటున్నారు. అందుకే దేవాలయంలోకి వెళ్లి దేవుడి విగ్రహన్ని చూడగానే ప్రశాంతత లభిస్తుందని పండితులు అంటున్నారు.

అయోధ్యలోని రామమందిరంలోని రామ్ లల్లా విగ్రహానికి కళ్లకు గంతలు లేకుండా కొన్ని ఫొటోలు ఇప్పటికే మీడియాలో వైరల్ గా మారాయి. ఈ విషయమై శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ విచారిస్తామని తెలిపింది. ఈ ఫోటోలు ఎలా బయటకు వచ్చాయన్న అంశంపై ఆరా తీస్తామని ప్రకటించింది.

ఇది కూడా చదవండి:  రాత్రి పడుకునేముందు ఈ గింజలు తింటే..షుగర్ కంట్రోల్లో ఉండటం ఖాయం..!!

#ayodhya-ram-mandir
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe