దుబాయ్ అనగానే మనకు గుర్తుకు వచ్చేది బుర్జ్ ఖలీఫా. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా పరిగణించబడుతున్న బుర్జ్ ఖలీఫా ప్రత్యేకమైన డిజైన్ కళ్లు చెదిరేలా ఉంటాయి.దుబాయ్ ల్యాండ్‌స్కేప్‌లో ఇంత బలమైన ఇంకా అందమైన భవనాన్ని నిర్మించడం చాలా సవాళ్లను కలిగి ఉంది. అయితే వాటన్నింటినీ మించి బుర్జ్ ఖలీఫా ఇప్పుడు దుబాయ్‌కి చిహ్నం.
దుబాయ్ నగరం వివిధ ఎత్తైన భవనాలు ఆధునిక ఆలోచనలకు ప్రసిద్ధి చెందింది. అలాంటి దుబాయ్‌కి ప్రతీక బుర్జ్ ఖలీఫా. ఇది కేవలం భవనమే కాకుండా దుబాయ్ అభివృద్ధిని, దుబాయ్ విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పేలా రూపొందించబడింది. బుర్జ్ ఖలీఫా అధికారికంగా 2010లో ప్రారంభించబడింది. మొదట దీనిని బుర్జ్ దుబాయ్ అని పిలిచేవారు. కానీ అబుదాబి అధ్యక్షుడు ఖలీఫా బిన్ జాయెద్ అల్ నయన్ గౌరవార్థం దీనిని బుర్జ్ ఖలీఫాగా మార్చారు. ఎందుకంటే దుబాయ్ ఆర్థిక సంక్షోభం నుంచి కోలుకునేలా చేసింది ఖలీఫా బిన్ సయ్యద్ అల్ నయన్.
బుర్జ్ ఖలీఫా నిర్మాణం జనవరి 2004లో ప్రారంభమైంది. 2010లో పనులు పూర్తి చేసి భవనాన్ని వినియోగంలోకి తెచ్చారు.
ఈ భవనం దాదాపు 2716.5 అడుగుల పొడవు 163 అంతస్తులను కలిగి ఉంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం, ప్రపంచంలోనే ఎత్తైన ఫ్రీ-స్టాండింగ్ నిర్మాణం వివిధ రికార్డులను కలిగి ఉంది. ఈ భవనం మహమ్మద్ అలబార్ యాజమాన్యంలోని అతిపెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ ఎమ్మార్ ప్రాపర్టీస్‌కు చెందినది.
దుబాయ్ మాల్ ,దుబాయ్ ఫౌంటెన్‌తో సహా దుబాయ్ ల్యాండ్‌మార్క్‌లను ఈ సంస్థ నిర్మించింది. ఎమ్మార్ ప్రాపర్టీస్ మూడు నిర్మాణ సంస్థలతో కలిసి నిర్మాణ పనులు చేపట్టింది. దక్షిణ కొరియాకు చెందిన Samsung C&T కంపెనీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన అరబ్టెక్ కంపెనీ మరియు బెల్జియంకు చెందిన BESIX కంపెనీ కలిసి నిర్మాణాన్ని పూర్తి చేశాయి. బుర్జ్ ఖలీఫా స్థిరత్వాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్మించబడింది. అంటే ఈ భవనం సంవత్సరానికి దాదాపు 15 మిలియన్ గ్యాలన్ల నీటిని సేకరిస్తుంది. ఈ నీటిని భవనంలోని అన్ని మొక్కలకు ఉపయోగిస్తారు.