వరల్డ్ లో అత్యధిక పారితోషికం పొందుతున్న 2వ భారతీయ సంతతికి చెందిన టెక్ CEO ఎవరో తెలుసా?

2023సంవత్సరంకు గాను USలో అత్యధిక వేతనం పొందుతున్న CEOల జాబితాలో భారత సంతతికి చెందిన వ్యక్తి నికేష్ అరోరా రెండవ స్థానం దక్కించుకున్నారు. ప్రస్తుతం అతని ఆదాయ విలువ 151 మిలియన్ డాలర్లుగా ఉంది.నికేష్ అరోరా గూగుల్,, సాఫ్ట్‌బ్యాంక్ లతో కూడా కలిసి పనిచేశారు.

New Update
వరల్డ్ లో అత్యధిక పారితోషికం పొందుతున్న 2వ భారతీయ సంతతికి చెందిన టెక్ CEO ఎవరో తెలుసా?

గూగుల్, సాఫ్ట్‌బ్యాంక్ లలో పనిచేసిన భారతీయ సంతతికి చెందిన టెక్ CEO నికేష్ అరోరా అత్యధికంగా సంపాదిస్తున్నవారిలో జాబితాలో రెండవ స్థానంలో ఉన్నారు. నికేశ్ అరోరా 1989లో ఐఐటీ వారణాసి నుంచి పట్టభద్రుడయ్యాడు. ఇంజనీరింగ్ పట్టా పొందిన తరువాత, అతను బోస్టన్ కళాశాల నుండి MS, ఫైనాన్స్  జనరల్ డిగ్రీని పొందాడు.నికేశ్ అరోరా నికర విలువ 1.5 బిలియన్ డాలర్లు. భారతీయ సంతతికి చెందిన వారిలో, 17 మంది టాప్ 500లో జాబితా ఆయన రెండవ స్థానంలో ఉన్నారు. అడోబ్ శంతను నారాయణ్ $44.93 మిలియన్ల జీతంతో 11వ స్థానంలో నిలిచారు. సంజయ్ మల్హోత్రా (మైక్రాన్ టెక్నాలజీ), అజయ్ గోపాల్ (యాన్సిస్)  రేష్మా కేవల్రమణి (వెర్టెక్స్ ఫార్మాస్యూటికల్స్) జాబితాలో మొదటి 120 మందిలో ఉన్నారు.

అత్యధికంగా చెల్లించే టాప్ 5 టెక్ సీఈఓలలో వీరితో పాటు, మైక్రోన్ టెక్నాలజీ నుంచి సంజయ్ మల్హోత్రా, యాన్సిస్ నుంచి అజయ్ గోపాల్, IBM నుంచి అరవింద్ కృష్ణ, వెర్టెక్స్ ఫార్మాస్యూటికల్స్ నుంచి రేష్మా కేవల్రమణి కూడా ఈ జాబితాలో భారతీయ సంతతికి చెందిన సీఈవోలు ఉన్నారు.

2023లో అత్యధికంగా సంపాదిస్తున్న టెక్నాలజీ CEOలు

1. హాక్ టాన్, CEO, బ్రాడ్‌కామ్ - $162 మిలియన్

2. నికేష్ అరోరా, CEO, పాలో ఆల్టో నెట్‌వర్క్స్ - $151 మిలియన్

3. స్టీఫెన్ స్క్వార్జ్‌మాన్, CEO, బ్లాక్‌స్టోన్ గ్రూప్ - $119.78 మిలియన్

4. క్రిస్టోఫర్ విన్ఫ్రే, CEO, చార్టర్ కమ్యూనికేషన్స్ - $89.1 మిలియన్

5. విల్ లాన్సింగ్, CEO, FICO - $66 మిలియన్

Advertisment
తాజా కథనాలు