/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/google-voice.jpg)
మీరు ఏదైనా తెలియని ప్రదేశానికి, ప్రాంతాలకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా Google Mapని ఫాలో అవుతుంటారు. అయితే మీరు గుగూల్ మ్యాప్ ను ఆన్ చేసిన తర్వాత ఒక తియ్యటి స్వరం మీకు వినిపిస్తుంది. రీచ్ యువర్ డెస్టినేషన్, టెన్ మీటర్స్, టేక్ లెఫ్ట్, టేక్ రైట్...టెన్ మీటర్స్, అంటూ ఎంతో స్వీటుగా వినిపిస్తుంది. అయితే ఆ వాయిస్ ఎవరిదని మీరు ఎప్పుడైనా ఆలోచించారా?
ఆ వాయిస్ ఆస్ట్రేలియాకు చెందని కారెన్ జాక్సన్ అనే మహిళది. వాయిస్ ఓవర్ ఆర్టిస్టుగానే కాకుండా, రైటర్ గా, సింగర్ గా మంచి గుర్తింపు పొందిన జాక్సన్ జీపీఎస్ గార్ల్ బ్రాండ్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా పది కోట్లకు పైగా జీపీఎస్ యూనిట్లు, 30కోట్ల స్మార్ట్ ఫోన్ డివైజ్ లలో కారెన్ స్వరం వినిపిస్తుంది. అందుకే ఆమెను జీపీఎస్ గర్ల్ అని పిలుస్తుంటారు.
ఆస్ట్రేలియాలోని మాకే నగరంలో జన్మించింది కారెన్. తనకు ఏడేళ్ల వయస్సులోనే పాటలు రాసింది. ప్రముఖ గాయని ఓవియా న్యూటన్ ను స్పూర్తిగా తీసుకుంది. కరెన్ వృత్తి రీత్యా వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్, సింగర్, కంపోజర్, ఇన్‌ఫ్లుయెన్సర్. కరెన్‌ను చాలా అవార్డులతో సత్కరించారు. ఇప్పుడు ఆమె వాయిస్ గూగుల్ మ్యాప్ ద్వారా ప్రపంచంలోని కోట్లాది మందికి చేరువైంది. అలాగే 2011 నుండి 2014 వరకు ఆపిల్ ఐఫోన్‌లు, ఐపాడ్‌లు, ఐప్యాడ్‌లలోని సిరి అప్లికేషన్‌లో కరెన్ జాకబ్‌సెన్ వాయిస్ ఉపయోగించారు..
మహిళా ఎంటర్‌టైనర్‌గా, ఆమె తన వన్ ఉమెన్ షోలను చాలా వరకు అందించింది. ది ట్రయాడ్, ది లారీ బీచ్‌మన్ థియేటర్, ది పబ్లిక్ థియేటర్, ది డ్యూప్లెక్స్, ది బిట్టర్ ఎండ్‌తో సహా. జాకబ్‌సెన్ రెండు పుస్తకాలు కూడా రాశారు. ఎవరి పేరు రీకాలిక్యులేట్ - డ్రైవింగ్ పనితీరు విజయానికి దిశలు, మీ భవిష్యత్తు కోసం GPS గర్ల్స్ రోడ్ మ్యాప్. కరెన్ డాసన్స్ క్రీక్ కోసం సౌండ్‌ట్రాక్‌ను కూడా కంపోజ్ చేసింది. 2002లో కారెన్ కు వచ్చిన ఒక ఫోన్ కాల్ తన జీవితాన్ని మార్చింది.
అమెరికాలోని ఓ సంస్థ ఆస్ట్రేలియాకు చెందిన మహిళా వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ కోసం సెర్చింగ్ లో ఉంది. కారెన్ గురించి తెలిసిన ఆ సంస్థ ప్రతినిధులు కారెన్ కు ఫోన్ చేశారు. కారెన్ ఆ ఉద్యోగంలో చేరి దాదాపు 50 గంటలపాటు తన మాటలు రికార్డు చేసి జీపీఎస్ వాయిస్ కోసం వాయిస్ సిస్టమ్ ను రెడీ చేశారు. ఇప్పుడు ఏ స్మార్ట్ ఫోన్ లో గూగుల్ మ్యాప్ లో ఒపెన్ చేసినా కారెన్ గొంతు వినిపిస్తుంది. కేవలం జీపీఎస్ లోనే కాకుండా ఎలివేటర్స్, క్రూయిజ్ షిప్స్, సినిమా థియేటర్లు, హోటల్స్, సాఫ్ట్ వేర్ అప్లికేషన్స్ లోనూ కారెన్ గొంతు వినిపిస్తుంది. జీపీఎస్ రాక ముందు కూడా కారెన్ తన గొంతును టెలివిజన్, రేడియో కార్యక్రమాల కోసం అందించింది.