National Doctor's Day: ఈ 5 ప్రాణాంతక వ్యాధులకు మొదటి స్పెషలిస్ట్ ఎవరో తెలుసా?

‘వైద్యోనారాయణో హరిః అన్న సూక్తి ప్రకారం...బ్రహ్మ ప్రాణం పోస్తే..పునర్జన్మ ఇచ్చేది వైద్యులు. అందుకే వైద్యులను దైవంతో సమానంగా భావిస్తుంటారు. భాష, కులం, మతంతో సంబంధం లేకుండా ప్రతిఒక్కరూ వైద్యులను దైవసమానులుగా భావిస్తారు. దేవుడు జన్మనిస్తే...పునర్జన్మనిచ్చేంది వైద్యులంటారు. మరీ ముఖ్యంగా ప్రపంచం మొత్తం కోవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కొన్న సమయంలో వైద్యులు చేసిన కృషి మరవలేనిది. చికిత్స ద్వారా వేలాది మంది ప్రాణాలను రక్షించే సామర్థ్యం వైద్యులకు ఉంది. అందుకే జులై 1న జాతీయ వైద్యుల దినోత్సవం జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఐదు ప్రాణాంతక వ్యాధులకు స్పెషలిస్టు అయిన భారతీయ మొదటి వైద్యుడి గురించి తెలుసుకుందాం.

New Update
National Doctor's Day: ఈ 5 ప్రాణాంతక వ్యాధులకు మొదటి స్పెషలిస్ట్ ఎవరో తెలుసా?

వైద్యులను దైవంతో సమానంగా భావిస్తుంటాం. కోవిడ్ సమయంలో వైద్యులు చేసిన కృషి ఎప్పటికీ మరవలేనిది. 24గంటలు అహర్నిశలు పనిచేస్తూ ఎంతో మంది ప్రాణాలను కాపాడారు. కోవిడ్ నుంచి కోలుకున్న ఎంతో మంది వైద్యుల రూపంలో వచ్చిన ఆ దేవుడే తమ ప్రాణాలు కాపాడారంటూ చేతులెత్తి మొక్కిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వైద్యుల కోసం ప్రతి ఏడాది జూలై1న జాతీయ వైద్యుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఎంతో మంది వైద్యుల కృషిని స్మరించుకోవడంతోపాటు పలుచోట్ల వారిని సత్కరిస్తుంటారు. కాబట్టి, ఈ ఎపిసోడ్‌లో 5 ప్రాణాంతక వ్యాధుల భారతీయ మొదటి వైద్యుడి గురించి తెలుసుకుందాం.

national doctors day

1. భారతదేశపు మొట్టమొదటి డయాబెటిక్ డాక్టర్:
ఎం. విశ్వనాథన్‌ను భారతదేశంలో 'ఫాదర్ ఆఫ్ డయాబెటాలజీ ఇన్ ఇండియా' అని పిలుస్తారు. అతను 1948లో గవర్నమెంట్ స్టాన్లీ హాస్పిటల్‌లో భారతదేశంలో మొట్టమొదటి డయాబెటిక్ క్లినిక్‌ని ప్రారంభించాడు. స్వతంత్రానంతర భారతదేశంలో మొదటి డయాబెటిక్ క్లినిక్‌ని ప్రారంభించి...సుమారు 30 నుండి 40 సంవత్సరాల పాటు,మధుమేహ రోగులకు చికిత్స చేసాడు. అంతేకాదు చాలా మంది మధుమేహ వైద్యులకు శిక్షణ కూడా ఇచ్చాడు.

2.మొదటి క్యాన్సర్ నిపుణుడు:
డాక్టర్ సురేష్ అద్వానీ భారతదేశంలో మొట్టమొదటి క్యాన్సర్ నిపుణుడు. సురేష్ అద్వానీ ఆంకాలజిస్ట్ (MBBS, MD). 8 సంవత్సరాల వయస్సులో పోలియో కారణంగా నడుము నుండి పక్షవాతానికి గురైన డాక్టర్ అద్వానీ అసమానతలను అధిగమించి భారతదేశంలో బోన్ మ్యారో మార్పిడిని విజయవంతంగా నిర్వహించి మొదటి ఆంకాలజిస్ట్ అయ్యాడు.

3.మొదటి కార్డియాలజిస్ట్:
శివరామకృష్ణ అయ్యర్ పద్మావతి భారతీయ కార్డియాలజిస్ట్. ఆమె ఢిల్లీలోని నేషనల్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్‌గా, ఆల్ ఇండియా హార్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలిగా కూడా ఉన్నారు. కార్డియాలజీలో విద్యార్థులకు శిక్షణ ఇవ్వడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థతో కలిసి పనిచేశారు.ఆమె చేసిన కృషికి దేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారాలు అయిన పద్మ విభూషణ్, పద్మభూషణ్ అవార్డులు కూడా పొందారు.

4. మొదటి న్యూరో సర్జన్:
దేశంలో మొట్టమొదటి భారతీయ న్యూరో సర్జన్ డాక్టర్ జాకబ్ చాందీ. అతను వైద్య శాస్త్ర ఉపాధ్యాయుడు మాత్రమే కాదు, భారతదేశంలో మొదటి న్యూరో సర్జన్‌గా,విస్తృతంగా పనిచేశాడు. అతను భారతదేశంలో ఆధునిక న్యూరో సర్జరీకి పితామహుడిగా కూడా పేరొందాడు.

5. మొదటి గైనకాలజిస్ట్:
మేరీ పూనెన్ లూకోస్ గైనకాలజిస్ట్, ప్రసూతి వైద్యురాలు. ఆమె భారతదేశపు మొదటి మహిళా సర్జన్ జనరల్‌గా ప్రసిద్ధి చెందారు. దేశం నలుమూలలా పనిచేసి మహిళల సమస్యలను వింటూ వారికి వైద్యం అందించారు.
ఈ రోజున, భారతదేశంలో ఈ వ్యాధుల చికిత్సను ప్రారంభించిన ఈ వైద్యులకు జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా వందనం చేస్తున్నాము.

Advertisment
Advertisment
తాజా కథనాలు