Diwali: దీపావళి నాడు దానం చేయకూడని వస్తువులు ఏంటో తెలుసా!

దీపావళి నాడు కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే అని పండితులు చెబుతున్నారు. వాటిలో ముఖ్యమైనవి చెప్పులు, పర్ఫ్యూమ్‌ , గాజు వస్తువులు వీటిని దానం చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని పండితులు చెబుతున్నారు.

Diwali: దీపావళి నాడు దానం చేయకూడని వస్తువులు ఏంటో తెలుసా!
New Update

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా దీపావళి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. నరక చతుర్దశి రోజున దీపావళిని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. దీని వెనుక ఉన్న పురాణ గాథ గురించి అందరికే తెలుసు. సత్యభామ నరకాసురుడిని సంహరించిన కారణంగా దీపావళి పండుగను జరుపుకుంటారు.

పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటారు. మిత్రులకు , శ్రేయోభిలాషులకు బహుమతులు ఇస్తుంటారు. కానీ ఈ పండుగ వేళ కొన్ని వస్తువులను పొరపాటున కూడా ఎవరికీ ఇవ్వకూడదని మన పండితులు తెలియజేస్తున్నారు. దీంతో మనం ఏ వస్తువులు దానం చేయకూడదో తెలుసుకుంటే మంచిది.

పండుగ నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ పాదరక్షలు దానం చేయకూడదు. ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురౌతాయి. అంతేకాకుండా పొరపాటున వీటిని దాన చేస్తే మనకు చిక్కులు వస్తాయి. అలాగే కొందరు బహుమతులుగా సెంట్‌ బాటిళ్లు వంటివి ఇస్తుంటారు. కానీ దీపావళి నాడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పర్ఫ్యూమ్‌ ని బహుమతిగా ఇవ్వకండి.

ఇలా చేయడం వల్ల శుక్రుడు బలహీన పడి...ఆర్థిక సమస్యలను సృష్టిస్తాడు. అందుకే ఎట్టిపరిస్థితుల్లోనూ సెంట్‌ బాటిళ్లు బహుమతులుగా ఇవ్వకూడదు. ఇదిలా ఉండగా..ప్రస్తుత కాలంలో గాజు వస్తువులకు చాలా గిరాకీ ఉంది. దీంతో వీటిని గిఫ్ట్‌లుగా ఇచ్చేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. గాజు వస్తువులను బహుమతులుగా ఇవ్వడం వల్ల సమస్యలే వస్తాయి.

దీని వల్ల ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. దీపావళి రోజు ప్రతి ఒక్కరు ఇంటిని శుభ్రం చేసుకోవాలి. అపరిశ్రుభంగా ఉన్న చోట లక్ష్మీదేవి నివాసం ఉండదు. ఇంట్లోని ప్రతి మూల శుభ్రం చేయడం మరిచిపోకూడదు. పండుగ నాడు చిరిగిన బట్టలు వేసుకోకూడదు.

Also read: దీపావళి పండుగ చేసుకోవాలంటనే వణికిపోతున్న ఊరు..ఎక్కడ ఉందంటే!

#diwali #donate #things
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe