బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని హోదాపై బండి సంజయ్ రియాక్షన్ ఇదే..!!

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ జోరు కనిపిస్తుంటే..బీజేపీ మాత్రం అంతర్గత విభేదాలతో సతమతమవుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీపై అధిష్టానం కన్నేసింది. రాష్ట్రానికి చెందిన సీనియర్ నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహించింది. టీ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ను తప్పిస్తారన్న వార్తలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల 8న హనుమకొండలో బీజేపీ భారీ బహిరంగసభను తలపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సభకు ప్రధాని నరేంద్రమోడీ హాజరవ్వనున్నారు. ఈ సభలో మోడీ ఏం మాట్లాడనున్నారు..అనే విషయంపై రాజకీయా వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.

New Update
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని హోదాపై బండి సంజయ్ రియాక్షన్ ఇదే..!!

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ నెల 8న హనుమకొండలో జరిగే భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా రానున్నారు. దీంతో ఈ సభలో మోడీ ఏం మాట్లాడతారన్న విషయంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఇప్పటికే చాలా మంది బీజేపీ శ్రేణులు మోడీ రాకకోసం ఎదురుచూస్తున్నారు. తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలన్న లక్ష్యంతోనే ఈమధ్య కాలంలో వరుస పర్యటనలపై మోడీ ఫోకస్ పెట్టారు. ఇప్పుడు తాజాగా బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ను మార్చుతున్నట్లు వార్తలు ఈ మధ్యకాలంలో జోరుగా వినిపిస్తున్నాయి.

BANDI SANJAY

అయితే హనుమకొండలో జరిగే సభకు జనసమీకరణపై ఆదివారం సాయంత్రం బీజేపీ నేతలు సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలోనే పార్టీ కార్యకర్తలు..రాష్ట్ర అధ్యక్షుడిని మారుస్తున్నారన్న వార్త గుప్పుమంటున్నాయి ఇది నిజమేనా అంటూ బండి సంజయ్ ను అడిగారు. పార్టీ కార్యకర్తలు అడిగిన ప్రశ్నకు బండి సంజయ్ సమాధానం ఇచ్చారు. మోడీ బహిరంగ సభకు రాష్ట్ర అధ్యక్షుని హోదాలో వస్తానో లేదో తెలియదు. బండి వల్లే తెలంగాణలో బీజేపీ గ్రామస్థాయి వరకు విస్తరించిందని కార్యకర్తలు అంటున్నారు. కేవలం బండి సంజయ్ పోరాటం వల్ల గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల అరాచకాలను ఎదుర్కొంటున్నామని స్పష్టం చేశారు.

బండి సంజయ్ స్టేట్ చీఫ్ గా కొనసాగాలంటూ పలువురు కార్యకర్తలు కన్నీళ్లు పెట్టుకున్నారు. మీ కష్టాన్ని వ్రుథా కానివ్వనని బండి సంజయ్ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ఏదిఏమైనప్పటికీ పార్టీ నిర్ణయమే తుది నిర్ణయం అవుతుందని...ప్రధాని మోడీ సభకు అందరూ హాజరై సభను విజయవంతం చేయాలని బండి కార్యకర్తలకు సూచించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు