ఫ్రీజర్‌లో ఉంచిన వైన్ ఎందుకు గడ్డ కట్టదు..ఎప్పుడైనా ఆలోచించారా? మద్యం తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఆల్కాహాల్ తాగే ముందు అది మరింత చల్లగా ఉండాలని ఐస్ ముక్కలు వేసుకుని తాగుతుంటారు. కానీ ఫ్రీజర్ లో ఉంచిన మద్యం ఎందుకు గడ్డకట్టదు. ఎప్పుడైనా ఆలోచించారా? By Bhoomi 26 Jun 2023 in లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి నేటికాలంలో చాలా మందికి ఆల్కాహాల్ తాగే అలవాటు ఉంటుంది. ప్రత్యేక సందర్భాలు లేదా సంతోషకరమైన సందర్భాల్లో మద్యం సేవిస్తుంటారు. అయితే చాలామంది ఆల్కాహాల్ మరింత చల్లగా ఉండేందుకు ఐస్ క్యూబ్స్ కలుపుకుని తాగుతుంటారు. అయితే ఫ్రీజర్‌లో ఉంచిన తర్వాత కూడా వైన్ ఎందుకు గడ్డకట్టదు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఫ్రీజర్‌లో ఉంచిన నీరు గడ్డకట్టినప్పుడు, ఆల్కహాల్ ఎందుకు గడ్డకట్టదు? వంటి ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఏ ద్రవ పదార్థమైనా సరే ఫ్రీజర్ లో పెడితే గడ్డ కడుతుంది. ప్రతీ లిక్విడ్ లో దాని అంతర్గత ఉష్ణోగ్రత ఉండటంతో దాని వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. దాని వాతావరణంలోని ఉష్ణోగ్రత తగ్గినట్లయితే దానిలోని అణువులు ఒకదానికొకటి దగ్గరగా చేరుతాయి. దీంతో ద్రవ పదార్థం గడ్డ కడుతుంది. ద్రవ పదార్థం గడ్డకట్టడమనేది చాలా కారణాలపై ఆధారపడి ఉంటుంది. అయితే ఆల్కాహాల్లో ఉండే ఆర్గానిక్ మాలిక్యూల్స్ దానిని గడ్డకట్టనీయకుండా చేస్తాయి. ద్రవపదార్థం గడ్డకట్టడమనేది దాని ఘనీభవనస్థానంపై ఆధారపడుతుంది. ప్రతీ పదార్థానికి దాని ఘనీభవన స్థానం వేరు వేరుగా ఉంటుంది. నీరు జీరో డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర గడ్డకడుతుంది. ఆల్కాహాల్ దాని ఘనీభవన స్థానం 114 డిగ్రీ సెంటీగ్రేడ్. ఆల్కాహాల్ గడ్డకట్టాలంటే 114డిగ్రీ సెంటిగ్రేడ్ కన్నా తక్కువ ఉష్ణోగ్రత అవసరం. అయితే మన ఇళ్లలో ఉండే ఫ్రీజ్ లో జీరో నుంచి 10 లేదా అత్యధిక ఉష్ణోగ్రత 30డిగ్రీ సెంటీగ్రేడ్ గా ఉంటుంది. అందుకే ఇంట్లో ఉన్న ఫ్రిజ్ లో ఎంతసేపు మద్యం ఉంచినా గడ్డ కట్టకపోవడానికి కారణం ఇదే. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి