Tirumala Tirupati Devasthanam : తిరుమల తిరుపతి కి భక్తుల నిత్యం భక్తుల తాకిడి ఉంటూనే ఉంటుంది. దీంతో టీటీడీ(TTD) దేవాస్థానం హుండీ రూపంలో కాసులు కురుస్తోన్నాయి. దక్షిణాది రాష్ట్రాల నుంచే కాకుండా దేశం మొత్తం నుంచి భక్తులు భారీగా టీటీడీకి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఇక శ్రీవారికి వచ్చే ఆదాయం కూడా భారీగా పెరుగుతోంది. రోజుకు సగటున శ్రీవారి హుండీ ఆదాయం(Srivari Hundi income) రూ. 3కోట్లు దాటుతున్నట్లు టీటీడీ తెలిపింది. ఈక్రమంలోనే 2023 ఏడాదిలో శ్రీవారికి వచ్చిన మొత్తం హుండీ ఆదాయం వివరాలను టీటీడీ వెల్లడించింది. గడిచి ఏడాదిలో మొత్తం శ్రీవారి హుండీ ఆదాయం రూ. 13వందల కోట్లు వచ్చిందని టీటీడీ తెలిపింది.
తిరుమల(TTD) శ్రీవారికి నగదు, ఇతర విలువైన కానుకలను భక్తులు సమర్పిస్తుంటారు. గత ఏడాది కాలం నుంచి స్వామివారి హుండీ ఆదాయం ప్రతినెల రూ. 100కోట్లకుపైగానే వస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఇక 2023 ఏడాదిలో శ్రీవారి హుండీకి ఏకంగా రూ. 1398కోట్ల ఆదాయం సమకూరిందని టీటీడీ వెల్లడించింది. 2023 ఏడాదిలో ప్రతి నెలా హుండీ ఆదాయం రూ. 100కోట్ల మార్కును దాటినట్లు అధికారులు వెల్లడించారు.
Also Read : ఇస్రో PSLV-C58 మిషన్ విజయవంతం..తొలిసారిగా భారత్ పోలారి మెట్రి మిషన్..!!
ఈ క్రమంలోనే 2023 జులై నెలలో అత్యధికంగా రూ. 129కోట్ల హుండీ ఆదాయం లభించిందని తాజాగా టీటీడీ తెలిపింది. ఇక నవంబర్ నెలలో అత్యల్పంగా రూ. 108కోట్లు హుండీ ఆదాయం వచ్చినట్లు వెల్లడించింది. ఇక డిసెంబర్ నెలలో కూడా హుండీ ఆదాయం రూ. 100కోట్లు దాటినట్లు టీటీడీ తెలిపింది. దీంతో వరుసగా 22వ నెల కూడా శ్రీవారి హుండీ వందకోట్లకు పైగా నగదు వచ్చినట్లు పేర్కొన్నారు. ఇక 2023 డిసెంబర్ నెలలో శ్రీవారికి హుండీలో కానుకల రూపంలో రూ. 116 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: ఇండియన్ ఆయిల్ లో డిగ్రీ, డిప్లొమా అర్హతతో 1,603 జాబ్స్.. అప్లికేషన్ లింక్ ఇదే!