Health Benefits : భోజనం చేశారా? నాలుగు అడుగులు వేయండి..!

ఆయుర్వేదం ప్రకారం..భోజనం చేసిన తర్వాత ఖచ్చితంగా కాసేపు నడవాలి. ఇది జీర్ణవ్యవస్థను మెరుగ్గా ఉంచేందుకు అత్యంత ప్రభావవంతమైన మార్గం. భోజనం చేసిన తర్వాత 100అడుగులు నడవాలని ఆయుర్వేదం చెబుతోంది. ఇలా నడవడం వల్ల జీర్ణవ్యవస్థ బలోపేతం అవ్వడంతోపాటు బరువు కూడా సులభంగా తగ్గుతారు.

New Update
Health Benefits : భోజనం చేశారా? నాలుగు అడుగులు వేయండి..!

ఫిట్ గా ఉండాలంటే ఆరోగ్యం బాగుండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంపై శ్రద్ద తీసుకోవాలి. మనం తీసుకునే ఆహారంపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అయితే భోజనం చేసిన తర్వాత ఏం చేయాలో తెలుసుకోవడం చాలా ముఖ్యమంటున్నారు హెల్త్ ఎక్స్ పర్ట్స్ (Ayurveda). ఆయుర్వేదం ప్రకారం...భోజనం చేసిన తర్వాత కాసేపు నడవడం (100 steps walking) చాలా ముఖ్యం. ఎందుకంటే నడక మన ఆరోగ్యాన్ని అన్నివిధాలా కాపాడుతుంది. నడక వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ (Health Benefits) ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

publive-image

జీర్ణవ్యవస్థకు మేలు:
మనలో చాలా మంది భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం లేదంటే..కూర్చోవడానికి ఇష్టపడుతారు. కానీ భోజనం చేసిన తర్వాత కాసేపు నడవడం (100 steps walking) వల్ల జీర్ణవ్యవస్థ వేగంగా పనిచేస్తుంది. భోజనం చేసిన తర్వాత వంద అడుగులు నడవడం అనేది పూర్వకాలం నుంచి వస్తుంది. ఇది జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుందని ఇప్పటికే ఎన్నోఅధ్యయనాల్లో నిరూపితమైంది. కేవలం జీర్ణవ్యవస్థ కాదే...ఫిట్ గా ఉండటం, జీర్ణప్రక్రియ (digestive process)వేగంగా పనిచేస్తుంది. భోజనం చేసిన తర్వాత 100 అడుగులు (100 steps walking) నడవాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇలా నడవడం వల్ల శరీరంగా ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణ వ్యవస్థ కూడా బాగుంటుంది.

భోజనం చేసిన తర్వాత 100 అడుగులు నడవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు :

1. ఇది ఆహారం జీర్ణం కావడానికి సహాయపడుతుంది.

2. కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది.

3. బ్లడ్ షుగర్ లెవెల్ ను మెరుగ్గా కంట్రోల్ చేస్తుంది.

4. నడక శరీరంలో ట్రైగ్లిజరైడ్ స్థాయిని అదుపులో ఉంచుతుంది.

రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది:
స్పోర్ట్స్ మెడిసిన్ అధ్యయనం ప్రకారం...భోజనం తర్వాత కొద్దిసేపు నడవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని కనుగొన్నారు. దీనివల్ల టైప్-2 డయాబెటిస్ (Type-2 diabetes)రిస్క్ కూడా తగ్గుతుంది. భోజనం తర్వాత 100 అడుగులు (100 steps walking) నడవాలని ఆయుర్వేదం సూచించింది. భోజనం చేసిన వెంటనే నిద్రపోకపోవడం వంటి మరికొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

నిజానికి, తిన్న వెంటనే నిద్రపోవడం వల్ల శరీరంలో కఫం, కొవ్వు పెరుగుతుంది. ఇది శరీరంలోని జీవక్రియను కూడా నెమ్మదిస్తుంది, దీని కారణంగా మీరు తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. ఆహారం తిన్న వెంటనే నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ కూడా బలహీనపడుతుందని వైద్యులు చెబుతున్నారు. ఆహారం తీసుకున్న వెంటనే నీళ్లు తాగడం వల్ల కూడా ఊబకాయం పెరుగుతుంది. భోజనం చేసిన తర్వాత నడవడం ఆరోగ్యానికి మంచిది. అయితే, ఆహారం తిన్న తర్వాత వేగంగా నడవకూడదని, కేవలం నడవాలని అనే విషయం గుర్తుంచుకోండి.

Advertisment
Advertisment
తాజా కథనాలు