మందుబాబులకు మత్తెక్కించే వార్త...ఆల్కాహాల్ కూడా మిమ్మల్ని యవ్వనంగా ఉంచుతుందట..!!

అందంగా కనిపించాలని ప్రతిఒక్కరికీ ఉంటుంది. అయితే కొంతమంది చిన్న వయస్సులోనే యవ్వనత్వం తగ్గిపోతున్నట్లు కనిపిస్తారు. అలాంటి వారు వోడ్కా, వైన్ తాగితే అందం పెరుగుతుందట. వైన్ తో ఫేస్ ప్యాక్ మీ ముఖాన్ని కాంతివంతంగా ఉంచుతుందట. రెడ్ వైన్ కు తేనె కలిపి ముఖానికి రాస్తే చర్మం తాజాగా మారుతుందట.

New Update
New Year : కొత్త సంవత్సరంలో ఈ చిన్న మార్పు చేయండి.. రమ్, విస్కీకి బదులు ఇది తాగండి..!!

నేటికాలంలో గాలిలో కాలుష్యం వల్ల ముఖంలో తేడాలు వచ్చేస్తున్నాయి. అందం తగ్గిపోయినట్లు అనిపిస్తుంది. ఈ బిజీ లైఫ్ లో శరీరం, అందం పై శ్రద్ధ తీసుకునే సమయమే ఉండటం లేదు. దీంతో చిన్న వయసులోనే ముఖంపై ముడతలు ఏర్పడుతున్నాయి. ముడతలు పడే చర్మం కోసం మీరు ఇంట్లో తయారు చేసిన ఫేస్ ప్యాక్ లను ఉపయోగించుకోవచ్చు. పాలు, పిండి, పసుపు, తేనె వంటివి మాత్రమే కాకుండా మీరు పండ్ల రసాలను కూడా ఉపయోగించి ఫేస్ ప్యాక్స్ ను ట్రై చేయవచ్చు. ఇది అనేక చర్మ సంబంధిత సమస్యలను వదిలించుకునేందుకు సహాయపడుతుంది. అయితే ఆల్కాహాల్ తో కూడా మీ అందాన్ని మరింత మెరుగుపరుచుకోవచ్చని మీకు తెలుసా? వొడ్కా, వైన్ వంటివి ముఖ సౌందర్యాన్ని ఎలా పెంచుతాయో సోషల్ మీడియాలో వివరించారు.

వైన్ తో ఫేస్ ప్యాక్:
రెడ్ వైన్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ముఖంపై దీనిని అప్లయ్ చేసినట్లయితే నల్లటి వలయాలు, ముడతలు తొలగిపోతాయి. అంతేకాదు రెడ్ వైన్ కు కొద్దిగా తేనె కలిపి ముఖానికి రాసుకుని 10 లేదా 15 నిమిషాలు ఉంచితే చర్మం తాజాగా కనిపిస్తుంది.

publive-image

పాదాల అందానికి బీర్:
సగం బాటిల్ బీర్ ను గోరువెచ్చని నీటిలో కలపాలి. తర్వాత కాళ్లను 20 నిమిషాలపాటు అందులో ముంచండి. బీర్ సహయ యాంటీ సెప్టిక్ వలే పనిచేసి, కాలి గోర్లను క్లీన్ చేస్తుంది. దీంతోపాటు బీర్ పాదాలను స్మూత్ గా చేస్తుంది. ఉప్పు, ఆలివ్, కొద్దిగా నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని చర్మంపై వలయాకారంలో రుద్దాలి. ఇది మీ శరీరంపై ఉండే నిర్జీవ కణాలను తొలగిస్తుంది. చర్మాన్ని తాజాగా చేస్తుంది. ఈ మిశ్రమాన్ని చర్మంపై రుద్దిన తర్వాత 5 నిమిషాలు అలాగే ఉంచాలి. తర్వాత నీటితో శుభ్రం చేసుకోండి.

publive-image

అంతేకాదు బీర్ ను పాదాలకు వాడితే నొప్పులు కూడా తగ్గిపోతాయట. జుట్టు సిల్కీగా మారుతుందట. రోజు మన చుట్టూ ఉండే వాతావారణానికి జుట్టు బహిర్గతం అవటం వల్ల వెంట్రుకలు పోడిగా మారుతాయి. అలాంటి సమయంలో జుట్టను షాంపూతో కడిగిన తర్వాత తేలికపాటి గాడత గల బీర్ లో ముంచాలి. ఇలా చేయడం వల్ల మీ జుట్టు సిల్కీగా మారడమే కాదు..తలపై చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

publive-image

ఇది కూడా చదవండి: తొక్కలో తొక్కే కదాని తొక్కేస్తున్నారా? డయాబెటిక్ రోగులకు చేసే మేలు తెలుస్తే షాక్ అవుతారు..!!

Advertisment
తాజా కథనాలు