CURD: పెరుగు తింటే నిద్ర ఎందుకు వస్తుందో తెలుసా? పెరుగు తింటే నిద్ర ముంచుకొస్తుందనే సంగతి తెలిసిందే. సాధారణంగా పాల ఉత్పత్తుల్లో ఉండే ట్రిప్టోఫాన్ వల్లే అలా జరుగుతుంది. ట్రిప్టోఫాన్ నిద్రను ప్రేరేపించే మెలటోనిన్ ను తయారు చేస్తుంది. మెలటోనిన్ వల్ల పెరుగు తిన్న వెంటనే నిద్ర ముంచుకొస్తుంది. By Jyoshna Sappogula 08 Mar 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి CURD: ప్రతి రోజూ పెరుగు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని డాక్టర్లు చెబుతుంటారు. అంతేకాదు పెరుగు తింటే నిద్ర కూడా ముంచుకొస్తుందనే సంగతి తెలిసిందే. సాధారణంగా పాల ఉత్పత్తుల్లో ఉండే ట్రిప్టోఫాన్ వల్లే అలా జరుగుతుంది. ట్రిప్టోఫాన్ నిద్రను ప్రేరేపించే మెలటోనిన్ ను తయారు చేస్తుంది. మెలటోనిన్ వల్ల పెరుగు తిన్న వెంటనే నిద్ర ముంచుకొస్తుంది. కేవలం పెరుగు మాత్రమే కాదు ట్రిప్టోఫాన్ కలిగిన ఏ ఆహారాన్ని తిన్న నిద్ర ప్రభావం పడుతుంది. Also Read: కిడ్నీ సమస్యలు ఉన్నవారు తీసుకోవాల్సిన ఆహారం ఇదే పెరుగు శరీరానికి అన్ని రకాలుగానూ మంచిదేనని వైద్యులు అంటున్నారు. రోజుకో గ్లాసు పాలు లేదా కప్పు పెరుగు తింటే మనకు కావాల్సిన ప్రొటీన్ మొత్తం అందుతుంది. పెరుగు అరుగుదల సమస్యను నివారిస్తుంది. పెరుగు శరీరానికి చలవ చేస్తుంది. అంతేకాదు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. శాకాహారులు పాల పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే విటమిన్ B12 లభిస్తుంది. ట్రిప్టోఫాన్ లో ఉండే సెరోటోనిన్, మెలటోనిన్ హార్మొన్లు నిద్ర పోయేలా చేస్తోంది. పెరుగు జీర్ణక్రియను పెంపొందిస్తుంది. అలాగే రోగనిరోధిక శక్తిని మెరుగుపరుస్తుంది. Also Read: వీటిని అల్పాహారంగా తీసుకుంటే కొవ్వు మొత్తం మాయం అయితే, రాత్రివేళ మాత్రం పెరుగు తినకపోవడమే ఉత్తమం అని మన పెద్ద వాళ్లు అంటారు. ముఖ్యంగా ఫ్రిజ్‌లో పెట్టిన పెరుగు తింటే మాత్రం జలుబు చేసే అవకాశాలున్నాయి. రాత్రి పెరుగు తినడం వల్ల శ్లేష్మం(దగ్గు) ఏర్పడుతుంది. జలుబు ఉంటే శ్లేష్మం తీవ్రత మరింత పెరుగుతుందని హెచ్చరిస్తారు. ముఖ్యంగా ఆస్తమా లేదా ఉబ్బసం ఉన్నవారు పెరుగు తినకపోవమే మంచిదని సూచిస్తున్నారు. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #curd మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి