రాత్రిపూట బ్రెష్ చేసుకోవటం తప్పనిసరి!

చాలా మంది ఉదయం మాత్రమే బ్రష్ చేస్తారు. అది మంచి అలవాటే. కానీ.. రాత్రిపూట పడుకునే ముందు కూడా తప్పనిసరిగా దంతాలు శుభ్రం చేసుకోవాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. లేదంటే భవిష్యత్తులో కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

రాత్రిపూట బ్రెష్ చేసుకోవటం తప్పనిసరి!
New Update

ఉదయంతో పాటు రాత్రి నిద్రపోయే ముందు కచ్చితంగా బ్రష్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అలా చేయడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందడంతో పాటు దంత సమస్యలు రాకుండా ఉంటాయని చెబుతున్నారు. ఇంతకీ రాత్రి పూట బ్రష్ చేయకపోతే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

మన దేశంలో వైద్య నిపుణులు చెప్పిన గణాంకాల ప్రకారం ప్రతి పది మంది భారతీయుల్లో 9 మంది దంతక్షయంతో బాధపడుతున్నారట. దీనికి ప్రధాన కారణం నోటి సంరక్షణపై సరైన అవగాహన లేకపోవడమే అంటున్నారు నిపుణులు. కాబట్టి ప్రతి ఒక్కరూ రెండు పూటలా బ్రష్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీకు కనుక నైట్ టైమ్ బ్రష్ చేసే అలవాటు లేకపోతే మీరు ఈ అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పళ్లు పుచ్చిపోవడం : ముఖ్యంగా రాత్రిళ్లు పళ్లు తోమకపోతే దంతక్షయంతో పాటు వివిధ ఓరల్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మీరు తీసుకునే ఫుడ్స్​లోని ఆహార కణాలు, బ్యాక్టీరియా దంతాలపై పేరుకుపోతాయి. కాబట్టి మీరు వాటిని త్వరగా శుభ్రం చేసుకోకపోతే.. పళ్లపై ఉండే స్ట్రాంగ్ ఎనామిల్ పొరను దెబ్బతీసే ఆమ్లాలను ఉత్పత్తి చేస్తాయి. దాంతో మన పళ్లు త్వరగా పళ్లు పుచ్చిపోవడం, దంతక్షయంలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

చిగుళ్ల ఇన్​ఫెక్షన్స్ : అదేవిధంగా మీరు నైట్ పడుకునే ముందు పళ్లను శుభ్రం చేసుకోకపోతే ఎదుర్కొవాల్సిన మరో సమస్య ఏంటే.. నోటి దుర్వాసన. ఎందుకంటే నిద్రలో లాలాజలం ఉత్పత్తి తగ్గడం కారణంగా బ్యాక్టీరియా వృద్ధి చెంది ఈ సమస్యకు కారణమవుతుంది. ఇకపోతే మీరు రాత్రిపూట బ్రష్ చేయకపోతే చిగుళ్ల వాపు, ఇన్ఫెక్షన్స్, పళ్లపై గార ఏర్పడడం లాంటి సమస్యలు రావచ్చని దంతవైద్యులు చెబుతున్నారు.

హార్ట్ ప్రాబ్లమ్స్ : కొన్ని అధ్యయనాల ప్రకారం.. రాత్రిళ్లు దంతాలు క్లీన్ చేసుకోకపోతే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని వెల్లడైంది. అలాగే చిగుళ్ల వాపు, నోటి పరిశుభ్రత కారణంగా సిస్టమిక్ ఇన్‌ఫ్లమేషన్‌, అథెరోస్క్లెరోసిస్‌ వంటి తీవ్రమైన జబ్బులు రావొచ్చు. ముఖ్యంగా రాత్రిపూట బ్రష్ చేసుకునే విషయంలో డయాబెటిస్ పేషెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రక్తంలో షుగర్ లెవల్స్ ఎక్కువ కావడం వల్ల వైట్ బ్లట్ సెల్స్ బలహీనంగా మారి.. పీరియాంటల్ (గమ్) వ్యాధులు వంటి నోటి ఇన్‌ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

#health-care
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe