కొంతమందికి బాడీ అంతా ఓ రంగులో ఉంటే పాదాలు మాత్రం వేరే రంగులో ఉంటాయి. దీంతో వాళ్ళు కాస్తా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఇలా పాదాల రంగు మారడానికి చాలా కారణాలున్నాయి. సూర్యకిరణాలు, కాళ్ళు పగలడం, అలర్జీలు, గీతల వంటి కారణాలతో పాదాల రంగు మారి నల్లగా కనిపిస్తాయి. ఇలా పాదాలపై ఉన్న టాన్ పోగొట్టుకోవడానికి ఇంట్లోనే మంచి టాన్ రిమూవింగ్ ప్యాక్ తయారు చేయొచ్చు. అదెలానో తెలుసుకోండి..
పసుపు కూడా చర్మ సమస్యల్ని దూరం చేస్తుంది. ఇది చర్మ అందాన్ని, కాంతిని పెంచుతుంది. పసుపులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు పాదాల్లోని సమస్యల్ని దూరం చేసి రంగు మెరుగ్గా చేసి అందంగా కనిపించేలా చేస్తాయి.నిమ్మరసంలో ఆమ్ల గుణాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని కాపాడడంలో కీ రూల్ పోషిస్తాయి. నిమ్మరసాన్ని జుట్టు, చర్మానికి అప్లై చేయొచ్చు. దీని వల్ల సన్ ట్యాన్ దూరమవుతుంది. అలాగే కాళ్ళని మెరిపించడంలో కూడా నిమ్మరసం బాగా పనిచేస్తుంది. పాదాల్లో దుర్వాసనని దూరం చేస్తుంది.
ప్రతిఇంట్లోనూ శనగపిండి వాతారు. దీనిని వాడడం వల్ల మృతకణాలు దూరమవుతాయి. అంతేకాకుండా చర్మంపై టాన్ కూడా తగ్గుతుంది. సాధారణంగా సన్ ట్యాన్‌ని దూరం చేయడానికి ఈ శనగపండి మంచి ఎక్స్‌ఫోలియెంట్‌లా పనిచేసి కాళ్ళ రంగు, టాన్‌ని పోగొడుతుంది.ఈ వేపపొడిలో ఎన్నో అద్భుతగుణాలు ఉంటాయి. దీనిని వాడడం వల్ల చాలా సమస్యలు దూరమవుతాయి. దీనిని జుట్టు, చర్మానికి రాయడం వల్ల చాలా లాభాలు ఉంటాయి. వేపలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఫంగల్, ఇన్ఫెక్షన్స్‌ని దూరం చేస్తాయి. ఇలాంటి పాదాల సమస్యల్ని కూడా వేప పొడి దూరం చేస్తుంది.