వర్షాకాలంలో ఈ కూరగాయలను అస్సలు తినకండి..ఎందుకుంటే..?!!

వర్షాకాలం వచ్చిందంటే కొన్నికూరగాయలకు దూరంగా ఉండాలి. ఎంత ఇష్టం ఉన్నా సరే వాటిని మాత్రం తినకుండా ఉండటమే బెటర్. ఎందుకంటే ఈ కూరగాయలను తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తప్పవు. ఇన్ఫెక్షన్ కారణగా జీర్ణక్రియకు సంబంధించిన ఎన్నో సమస్యలను ఎదుర్కొల్సి వస్తుంది. ఇంతకు వర్షాకాలంలో ఎలాంటి కూరగాయలు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

New Update
వర్షాకాలంలో ఈ కూరగాయలను అస్సలు తినకండి..ఎందుకుంటే..?!!

సీజన్ ఏదైనా సరే మన ఆరోగ్యానికి మేలు చేసే ఆహారపదార్థాలు తినడం అలవాటు చేసుకోవాలి. ప్రస్తుతం వేసవికాలం ముగిసి వర్షాకాలం మొదలైంది. పైగా వర్షాకాలంలో మనకు చిన్నపాటి ఇన్ఫెక్షన్లు రావడం సహజమే. జలుబు, దగ్గు, జ్వరం వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. ఇవి మనం తినే ఆహారాల వల్ల కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆహారం మీద స్ప్రే చేసే రసాయనాలు కూడా కారణం కావచ్చు. కాబట్టి వర్షాకాలంలో కొన్ని రకాల కూరగాయలను తినకూడదని గుర్తుంచుకోవాలి.

monsoon diet

వర్షాకాలంలో తినకూడని కూరగాయలివే:

ఆకు కూరలు:
ఆకుకూరలు మన శరీరానికి ఎల్లప్పుడూ మేలు చేస్తాయి. వీటి వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కానీ వాటిని వర్షాకాలంలో తినకూడదని డాక్టర్లు చెబుతుంటారు. ఎందుకంటే వర్షాకాలంలో బ్యాక్టీరియా, ఇతర అంటు క్రిములు వాటిపై గుణిస్తాయి. అంటురోగ క్రిములు పచ్చని ఆకులతో కూడిన ప్రదేశాలలో తమ నివాసాన్ని ఏర్పరుస్తాయి. కాబట్టి వర్షాకాలంలో ఆకుకూరలకు దూరంగా ఉండాలి. ఒకవేళ తప్పనిపరిస్థితుల్లో తినాల్సి వస్తే..వాటిని వేడినీళ్లలో మరిగించిన తర్వాత తినడం మంచిది.

వంకాయ:
కూరగాయలలో రారాజు వంకాయ. వంకాయ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. కానీ వీటిలో విషపూరిత రసాయనాలు చాలా ఉంటాయి. వర్షాకాలంలో పురుగులు సోకకుండా రసాయనాలు పిచికారీ చేస్తుంటారు. ఈ కాలంలో వీటిని తినడం వల్ల అనేక చర్మ సమస్యలు వస్తాయి. వికారం, వాంతులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వర్షాకాలంలో వంకాయలు తినకూడదని వైద్యులు చెబుతుంటారు.

క్యాప్సికమ్:
వర్షాకాలంలో క్యాప్సికమ్ విరిగా లభ్యం అవుతుంది. దీన్ని తినేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. క్యాప్సికమ్ లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.అయితే వర్షాకాలంలో క్యాప్సికమ్ కు పురుగులు రాకుండా రసాయనాలను పిచికారీ చేస్తుటారు. వీటిని తినడం వల్ల వికారం, వాంతులు, విరేచనాలు, శ్వాస సమస్యలు వస్తాయి. కాబట్టి వీటిని తినకపోవడమే మంచిది.

కాలీఫ్లవర్:
వర్షాలు ఎక్కువగా కురుస్తున్న సమయంలో కాలీఫ్లవర్ చెడిపోకుండా ఉండేందుకు రసాయనాలు స్ప్రే చేస్తున్నారు. ఇందులో ఉండే గ్లూకోసినోలేట్‌ల కారణంగా, ఎక్కువ సున్నితత్వం లేదా అలెర్జీ ఉన్నవారికి ఇది హాని కలిగిస్తుంది. కాబట్టి వర్షాకాలంలో క్యాలీఫ్లవర్ తినకపోవడమే మంచిది.

Advertisment
Advertisment
తాజా కథనాలు