ప్రెగ్నెన్సీ టైమ్ లో ఇవి అస్సలు తినొద్దు!

కొత్తగా పేరెంట్స్ అయ్యేవారు పిల్లల విషయంలో కాస్తా ఎగ్జైటింగ్‌గా ఉంటారు. వారు పుట్టకముందే కొన్ని వస్తువులు కొంటారు. అలా కొనే వాటిలో కొన్ని అవసరం లేనివి కూడా ఉంటాయి. దీని వల్ల డబ్బు వృధా. వస్తువులు కూడా వృథా అయిపోతాయి. కాబట్టి, అనవసరంగా కొనే వస్తులు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.

ప్రెగ్నెన్సీ టైమ్ లో ఇవి అస్సలు తినొద్దు!
New Update

Pregnancy Tips: బిడ్డకి పాలు పట్టే విషయంలోనూ నాలుగైదు బాటిల్స్ కొని పెడుతుంటారు. కానీ, వారికి అవసరమైన సైజ్‌లో ఉన్న బాటిల్స్ మాత్రమే కొనండి. వీటితో మీరు వస్తువులని, డబ్బుల్ని వృథా చేయలేరు.ఇది కూడా పిల్లలు పుట్టాకే తీసుకోండి. నిజం చెప్పాలంటే మన ఇంట్లోని టబ్స్ కూడా వాడొచ్చు. వారికి, మీకు సౌకర్యంగా ఉన్నవాటిని పుట్టిన తర్వాత చూసి తీసుకోవడం మంచిది.

ఇవి పిల్లల వస్తువులని పెట్టుకోవడానికి కొంటారు. అవసరం లేదండి. మీరు వాడే హ్యాండ్ బ్యాగ్స్, బ్యాక్ ‌ప్యాక్స్‌ని డైపర్ బ్యాగ్‌లా వాడొచ్చు. వీటిలో పిల్లలకి సంబంధించిన వస్తువలన్నింటినీ పెట్టుకోవచ్చు.అదే విధంగా, పుట్టిన వెంటనే పిల్లలకి బ్యూటీ రొటీన్ అవసరం లేదు. వారికి కావాల్సింది. సబ్బు, షాంపూ, ఆయిల్ నార్మల్ డ్రెస్సింగ్ కిట్. ఇవి కొన్నిసార్లు హాస్పిటల్స్ కూడా అందిస్తాయి. కాబట్టి, వెంటనే వారికి ఏవేవో క్రీమ్స్, పౌడర్స్, లోషన్స్ కొనొద్దు.

Also Read: ‘అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్’.. ఉర్రూతలూగిస్తున్న టీ20 వరల్డ్ కప్ సాంగ్!

అదే విధంగా, బొమ్మలు కూడా కొంటారు. అయితే, పుట్టాక ఎలాగూ చూసేవారు ఏవేవో కొనితెస్తారు. వాటిని చూశాక మిగతావి మీ దగ్గర లేనివి తీసుకోవడం మంచిది.బేబీ బంపర్స్, దుప్పట్లు కూడా కొంటారు. ఇవి కూడా పిల్లలు పుట్టాక వారి సౌకర్యాన్ని బట్టి కొనండి. అంతేకానీ, అందంగా ఉన్నాయి కదా అని పుట్టగానే అందులో పడుకోబెట్టాలని చూడొద్దు. అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లి ఒడి కంటే ఇంకేం సౌకర్యంగా ఉంటాయి చెప్పండి. అదే విధంగా, పిల్లలకి ఒక ఊయల ఉంటే సరిపోతుంది. అంతేకానీ, కొంతమంది వయసుని బట్టి సైజ్‌లని బట్టి తీసుకుంటారు. పిల్లలకి ఎక్కువ వయసు వచ్చే వరకూ కూడా అవసరమయ్యే మంచి కంఫర్ట్‌నిచ్చే ఊయలని తీసుకోండి.

పిల్లలు పుట్టకముందే స్లీప్ సూట్స్, సాక్సులు కొంటారు. ఇవి అప్పుడే పుట్టిన బిడ్డలు వేసుకోరు సరికదా.. వారికి చిరాకు తెప్పిస్తాయి. కాబట్టి, అలా బట్టలు కొనండి ఆపండి.

#pregnent-woman
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe