Childhood: చిన్ననాటి గాయాలు పెద్దయ్యాక కూడా వేధిస్తాయా..? పరిశోధనలో షాకింగ్‌ నిజాలు

చిన్ననాటి గాయాలు పెద్దయ్యాక కూడా వేధిస్తాయి. చిన్నప్పుడు అనుభవించే బాధాకరమైన సంఘటనల వల్ల యవ్వనంలో వెన్ను, నరాల బలహీనత, మెడ నొప్పులు, తలనొప్పి లాంటి దీర్ఘకాలిక అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.

Childhood: చిన్ననాటి గాయాలు పెద్దయ్యాక కూడా వేధిస్తాయా..? పరిశోధనలో షాకింగ్‌ నిజాలు
New Update

childhood: ప్రతిఒక్కరి జీవితంలో చిన్నతంలో ఎన్నో మంచి, చెడులను చూసే ఉంటారు. చిన్ననాటి అనుభావాలు గుర్తుకు వస్తే చాలామందిలో తెలియని ఉత్సాహం కనిపిస్తుంది. కొందరైతే పెద్దయ్యాక కూడా ఆ అనుభవాలను గుర్తుచేసుకుంటూ ఉంటారు. అయితే.. కొన్ని చిన్ననాటి గాయాలు కూడా చాలామందికి వేధిస్తుంటాయి. తాజాగా.. బాల్యంలో ఎదుర్కొనే గాయాలు, నొప్పి, భయంకరమైన సంఘటలపై పరిశోధనలు చేశారు. వీరిలో పెద్దయ్యాక కూడా 45 శాతం వరకు ఆ ప్రభావం ఉంటుందని అధ్యయనంలో తెలింది. చిన్నప్పుడు అనుభవించే బాధాకరమైన సంఘటనల వల్ల యవ్వనంలో వెన్ను, నరాల బలహీనత, మెడ నొప్పులు, తలనొప్పి వంటి దీర్ఘకాలిక అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు అంటున్నారు.

ఏదో ఒక రూపంలో పిల్లల మనస్సులను కలచివేస్తుంది

అంతేకాకుండా.. చిన్నప్పుడు శారీరక, మానసిక, లైంగిక వేధింపులు, ఎమోషనల్‌కు గురికావడం, తల్లిదండ్రుల సంరక్షకుల నిర్లక్ష్యం వంటి అనుభవాలు ఉన్న పిల్లలు.. యుక్త వయస్సులో మనసును తీవ్రంగా కలచి వేస్తాయని నిపుణులు అంటున్నారు. చిన్నప్పుడు తల్లిదండ్రుల అనారోగ్యం, పేరెంటల్ డెత్, పేరంటల్ డైవోర్స్, మాదకద్రవ్యాల వినియోగం వంటివి కూడా పిల్లలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయని గుర్తించారు. పెద్దయ్యాక కూడా ఇవి ఏదో ఒక రూపంలో పిల్లల మనస్సులను కలచివేస్తూ.. నిరాశా వాదులుగా మారుస్తాయంటున్నారు. ఇవే ఎక్కువగా వివిధ అనారోగ్యాలకు పరోక్షంగా కారణం అవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మానసిక, శారీరక గాయాలే పెద్దయ్యాక  ప్రతికూల ప్రభావం

అలాగే.. 75 ఏళ్ల వ్యవధిలో 8,26,452 మంది అడల్ట్స్ కలిగి ఉన్న 85 అధ్యయనాలకు సంబంధించిన సిస్టమేటిక్ రివ్యూస్‌ అండ్ మెటా- డాటాను విశ్లేషించారు. ఇటీవల చిన్ననాటి గాయం, అలాగే యుక్త వయస్సులో దీర్ఘకాలికి నొప్పికి గురికావడానికి మధ్య గల సంబంధంపై ఓ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు పరిశీలించారు. ఇందులో బాల్యంలో ఎదుర్కొనే తీవ్రమైన వేధింపులు, బలమైన మానసిక, శారీరక గాయాలు పెద్దయ్యాక 45 శాతం ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని అధ్యయనం చేసిన పరిశోధకులు నిర్ధారించారు.

ఇది కూడా చదవండి: భర్తను స్నేహితుల దగ్గర ఎగతాళి చేసి మాట్లాడుతున్నారా? ఏమౌతుందో తెలుసుకోండి!!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

#health-benefits #childhood
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe