Divya Deshmukh: నన్ను ఒక సెక్సిస్ట్ గా చూశారు.. భారత చెస్ ప్లేయర్ భారత చెస్ క్రీడాకారిణి దివ్యా దేశ్‌ముఖ్.. టాటా స్టీల్ మాస్టర్స్ టోర్నమెంట్ లో ఊహించని చేదు అనుభవం ఎదురైనట్లు తెలిపింది. వీక్షకులు తన ఆటమీదకంటే జుట్టు, బట్టలమీద ఫొకస్ చేశారని చెప్పింది. పరోక్షంగా తాను లైంగిక వేధింపులకు గురైనట్లు పేర్కొంది. By srinivas 30 Jan 2024 in ఇంటర్నేషనల్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి Indian Chess Player Divya Deshmukh: భారత చెస్ క్రీడాకారిణి దివ్యా దేశ్‌ముఖ్(Divya Deshmukh) సంచలన విషయం బయటపెట్టారు. ఇటీవల నెదర్లాండ్స్ (Netherlands)లో జరిగిన టాటా స్టీల్ మాస్టర్స్ టోర్నమెంట్ (Tata Steel Masters Tournament)లో తనకు ఊహించని చేదు అనుభవం ఎదురైనట్లు తెలిపారు. టోర్నమెంట్ జరుగుతున్న సమయంలో కొంతమంది తనను అదో రకంగా చూశారని, పరోక్షంగా తాను లైంగిక వేధింపులకు గురైనట్లు చెబుతూ ఎమోషనల్ అయ్యారు. View this post on Instagram A post shared by Divya Deshmukh (@divyachess) బట్టలు, జుట్టు చూశారు.. ఈ మేరకు మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌కు చెందిన 18 ఏళ్ల ఇండియన్ ఇంటర్నేషనల్ మాస్టర్ దివ్య.. తనకు ఎదురైనా చేదు అనుభవాలకు సంబంధించిన వివరాలను ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు. 'ఈ విషయాన్ని నేను ఎప్పటినుంచో బయటపెట్టాలనుకుంటున్నా. కానీ టోర్నీ ముగిసేవరకు ఓపిక పట్టాను. క్రీడాకారిణులతో ప్రేక్షకులు ఎలా వ్యవహరిస్తారో నేను దగ్గరినుంచి గమనించాను. మా ఆట మీద కంటే నా బట్టలు, జుట్టు, భాష, యాస వంటి అనవసర విషయాలనే పట్టించుకుంటున్నారు' అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇది కూడా చదవండి : Crime:స్నేహితుడితో అసహజ శృంగారం.. నగరం నడిబొడ్డున యువకుడి దారుణ హత్య చెస్ బోర్డ్ గేమ్ లోనూ వివక్ష.. ఇక ప్రతి ఆటలో పురుషులు తమ వాటను పూర్తిగా పొందుతున్నారని, కానీ సామర్థ్యంతో సంబంధం లేని చెస్ బోర్డ్ గేమ్ లోనూ మహిళలు వివక్షను ఎదుర్కొంటున్నారని చెప్పింది. 'ఇది విన్నప్పుడు నేను చాలా కలత చెందాను. మహిళలు చదరంగం ఆడుతున్నప్పుడు వారు ఎంతటి ప్రతిభగలవారో పట్టించుకోరు. ఇలాంటి ఆటల్లోనూ వారి బలాన్ని చూడాలనుకోవడం విచారకరమైన నిజం. నా ఇంటర్వ్యూలలో ప్రేక్షకులు నా ఆటను తప్ప మిగతావన్నీ ఎలా చర్చించారో చూసి నేను చాలా నిరాశ చెందాను. చాలా తక్కువ మంది మాత్రమే ఆటపై శ్రద్ధ పెట్టారు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇది ఒక విధంగా అన్యాయమని నేను భావించాను' అని ఆమె నొక్కి చెప్పింది. ఇక టాటా స్టీల్ మాస్టర్స్ టోర్నమెంట్‌లో 4.5 స్కోర్‌తో 12వ స్థానంలో నిలిచిన దివ్య.. గతేడాది ఆసియా మహిళల చెస్ ఛాంపియన్‌షిప్ గెలుచుకుంది. #indian-chess-player #divya-deshmukh #sexist-behaviour మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి