Madhuri: రోడ్డు ప్రమాదం కాదు.. కావాలనే నేనే ఇలా చేశా.. దివ్వల మాధురి సంచలన వ్యాఖ్యలు..

దివ్వల మాధురి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. టెక్కలి నుంచి పలాస మార్గంలో కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఆగి ఉన్న మరో కారును ఢీకొట్టింది. ప్రమాదంలో ఆమెకు గాయాలయ్యాయి. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సతీమణి వాణి తనపై చేసిన ఆరోపణలను భరించలేకే ఇలా చేసినట్లు మాధురి చెబుతున్నారు.

New Update
Madhuri: రోడ్డు ప్రమాదం కాదు.. కావాలనే నేనే ఇలా చేశా.. దివ్వల మాధురి సంచలన వ్యాఖ్యలు..

 ఏపీలో రెండు రోజులుగా దుమారం రేపుతున్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంలో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. శ్రీకాకుళంలో దివ్వల మాధురి కారుకు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆమెకు గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఆమెను పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Also Read: ఏపీ హోంమంత్రి అనితకు తృటిలో తప్పిన ప్రమాదం!

అయితే, తనపై, తన పిల్లలపై ట్రోల్స్ తట్టుకోలేకే ఆత్మహత్యయత్నం చేసుకున్నానని దివ్వల మాధురి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆసుపత్రిలో చికిత్సకు ఆమె నిరాకరించింది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సతీమణి వాణి తనపై చేసిన ఆరోపణలను భరించలేకే తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు మాధురి తెలిపింది. ఇది రోడ్డు ప్రమాదం కాదని.. కావాలనే ఆత్మహత్య చేసుకుందామని కారును ఢీ కొట్టానని చెప్పింది. టెక్కలి నుంచి పలాస మార్గంలో కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఆగి ఉన్న మరో కారును ఢీ కొట్టింది.

Also Read: గ్రామ సచివాలయాల్లో కీలక మార్పులు…ఇక నుంచి ఆ పేరుతో!

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సతీమణి వాణి తన భర్తపై పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. దివ్వల మాధురితో ఆయన వివాహేతర సంబంధం పెట్టుకున్నారని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాధురి ఆత్మహత్యాయత్నం సంచలనంగా మారింది.  వాణి ఆరోపణలు పక్కనపెడితే.. తనపై వచ్చే విమర్శల కంటే తాను శ్రీనుతో ఉండడమే బెటర్ అని మాధురి అన్నారు. తాను ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌తోనే ఉంటానని ఇటీవలే చెప్పారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు