TS DSC : జిల్లాల వారీగా డీఎస్సీకి ఎన్ని అప్లికేషన్లు వచ్చాయంటే..!!

తెలంగాణలో డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణ శనివారం (అక్టోబర్ 28)తో ముగిసింది. మొత్తం 1,76,530 అప్లికేషన్లు వచ్చాయి. అన్ని జిల్లాల నుంచి వచ్చిన అప్లికేషన్లు ఇవి. ముఖ్యంగా సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు అత్యధికంగా అప్లికేషన్లు వచ్చాయి.

TS DSC : జిల్లాల వారీగా డీఎస్సీకి ఎన్ని అప్లికేషన్లు వచ్చాయంటే..!!
New Update

తెలంగాణ డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణ ముగిసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 1,76,530 దరఖాస్తులు వచ్చాయి. అందులో సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు అత్యధికంగా దరఖాస్తులు 60,190 వచ్చినట్లు సమాచారం. ఇదిలా ఉండగా సెప్టెంబర్ 6న డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అదే నెల 20వ తేదీ నుంచి ఆన్ లైన్ విధానం ద్వారా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. దరఖాస్తుల గడువు ఈ నెల 21తో ముగిసింది. అయితే అభ్యర్థుల వినతి మేరకు ఈ గడువును మరోవారం పొడిగించింది విద్యాశాఖ. పొడిగించిన గడువు కూడా శనివారంతో ముగిసింది. మొత్తంగా 1,79,297మంది అభ్యర్థులు ఫీజు చెల్లించినట్లు అధికారులు తెలిపారు. ఇక డీఎస్సీ పరీక్షలను జనవరి నుంచి లేదా ఫిబ్రవరి మొదటివారం నుంచి నిర్వహించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

publive-image

ఇది కూడా చదవండి: రేపు దుబ్బాక బంద్‎కు బీఆర్ఎస్ పిలుపు.. రేవంత్, రఘునందన్ సంచలన రియాక్షన్!

కాగా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులతో సమానంగా మాజీ సైనికోద్యోగుల అర్హత మార్కులను తగ్గించాలని..సైనిక్ సంక్షేమ డైరెక్టర్ రాసిన లేఖపై నిర్ణయం తీసుకునేంత వరకు ఎక్స్ సర్వీస్ మెన్ కోటా పోస్టులను భర్తీ చేయరాని టీఎస్ పీఎస్సీకి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు. గ్రూప్ లో 4 నోటిఫికేషన్ లో మాజీ సైనికోద్యోగుల అర్హత మార్కుల తగ్గింపుపై నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ..దాఖలైన పిటిషన్ పై జస్టిస్ మాధవీదేవి విచారణ జరిపారు. ఎక్స్ సర్వీస్ మెన్ కోటా కింద ఎంతో మంది రాత పరీక్షలకు హాజరైనట్లు తెలిపారు. దీంతో సైనిక సంక్షేమ డైరెక్టర్ లేఖపై నెలరోజుల్లోగా తుది నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర సర్కార్ ను , టీఎస్పీఎస్సీని హైకోర్టు ఆదేశించింది. విచారణను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

ఈ ఏడాది జులై 1న రాతపరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 7.6లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. దీనికి సంబంధించిన తుది కీని కూడా వెల్లడించింది. పేపర్ 1 ఏడు ప్రశ్నలు, పేపర్ 2లో మూడు ప్రశ్నలు కలిపి మొత్తం 10 ప్రశ్నలను తొలగించింది. రెండు పేపర్లలో మొత్తం 13 ప్రశ్నల సమాధానాల్లో మార్పులు చేసింది. ఇందులో ఐదింటికి ఒకటి కన్నా ఎక్కువ సమాధానాలను సరైనవిగా పేర్కొంది.

కాగా ఫైనల్ కీ వెల్లడవ్వడంతో అభ్యర్థుల జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తిచేసింది. ఎలాంటి పొరపాట్లు జరగకుండా లేదా జనరల్ ర్యాంకు మెరిట్ లిస్టును (Group 4 Merit List) వెల్లడించేందుకు కమిషన్ కసరత్తు చేస్తోంది. పరీక్ష రాసిన అభ్యర్థులు పొందిన మార్కుల వివరాలు, జిల్లా స్థానికత, కేటగిరి వంటి వివరాలు ఈ జాబితాలో ఉండే ఛాన్స్ ఉంది. దసర పండగా తర్వాత మెరిట్ జాబితాను ఇవ్వాలని కమిషన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మహిళలకు సమాంతర రిజర్వేషన్లపై హైకోర్టు స్పష్టత ఇచ్చిన తర్వాతే ఎన్నికల కోడ్ తర్వాత 1:2 నిష్పత్తి ప్రకారం ఫైనల్ లిస్టును ప్రకటించే ఛాన్స్ ఉంది. అయితే దీనిపై స్పష్టత కోసం మరింత సమయం ఆగాల్సిందే.

ఇక రాష్ట్రవ్యాప్తంగా పలు శాఖల్లో ఉన్న గ్రూప్ 4 ఖాళీలను భర్తీ చేసేందుకు గతేడాది డిసెంబర్ లో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, జూనియర్ ఆడిటర్, వార్డు ఆఫీసర్ వంటి పోస్టులు ఉన్నాయి. మొత్తం 8,180 పోస్టులను భర్తీ చేసేందుకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ ఏడాది జులై 1న పరీక్షను నిర్వహించింది. మొత్తం 9లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 7లక్షలకుపైగా పరీక్ష రాశారు. ఈ పరీక్షకు సంబంధించి ఫైనల్ కీని అక్టోబర్ లో రిలీజ్ చేసింది టీఎస్పీఎస్సీ.

ఇది కూడా చదవండి:  ప్లాస్టిక్‌ బాటిల్స్‌లో వాటర్‌ తాగుతున్నారా? ఇవి తెలుసుకోకపోతే అంతే!

#ts-dsc #ts-dsc-trt
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe