AP Politics: విజయోత్సవ ర్యాలీలకి అనుమతి లేదు.. పెనమలూరు పోలీస్ స్టేషన్లను సందర్శించిన జిల్లా ఎస్పీ

ఎన్నికల ప్రక్రియ భాగంగా పెనమలూరు పోలీస్ స్టేషన్లను జిల్లా ఎస్పీ సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ నయీమ్ అద్మీ ఆస్మి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో విజయోత్సవ ర్యాలీలకి అనుమతి లేదన్నారు. పెనమలూరులో చిన్న చిన్న గొడవలు జరిగినా.. ప్రసుత్తం అంతా ప్రశాంతంగా ఉందన్నారు.

New Update
AP Politics: విజయోత్సవ ర్యాలీలకి అనుమతి లేదు.. పెనమలూరు పోలీస్ స్టేషన్లను సందర్శించిన జిల్లా ఎస్పీ

AP Politics: కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని ఎన్నికల ప్రక్రియ భాగంగా పెనమలూరు పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ సందర్శించారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా ఎస్పీ నయీమ్ అద్మీ ఆస్మి మాట్లాడుతూ పలు కామెంట్లు చేశారు. కృష్ణా జిల్లాలో పోలింగ్ ప్రశాంతం జరిగిందన్నారు. పెనమలూరులో చిన్న చిన్న గొడవలు జరిగినా.. ప్రసుత్తం పెనమలూరు నియోజకవర్గం అంతా ప్రశాంతంగా ఉందన్నారు. నియోజకవర్గంలో విజయోత్సవ ర్యాలీలకి అనుమతి లేదని నయీమ్‌ అద్మీ అస్మి తెలిపారు. అంతేకాకుండా నియోజకవర్గంలో 144 సెక్షన్ అమలులో ఉందన్నారు. రాజకీయ నాయకులు ఎన్నికల నిబంధనలు పాటించాలని జిల్లా ఎస్పీ నయీమ్ అద్మీ ఆస్మి సూచించారు. 50 చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేసామని, 133 గ్రామాల్లో పోలీస్ పికెట్స్, 70 కేసులు నమోదు 40 కేసుల్లో చార్జ్ షీట్స్ కూడా వేసామని జిల్లా ఎస్పీ నయీమ్ అద్మీ ఆస్మి తెలిపారు.

ఇది కూడా చదవండి: ఖాకీలు వలయంలో కాకినాడ కౌంటింగ్ సెంటర్.. కౌంటింగ్ కేంద్రం వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు: కలెక్టర్ జె నివాస్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు