Janasena: అనంతపురం జిల్లాలో జనసైనికులకు అవమానం..!

అనంతపురం జిల్లాలో జనసైనికులకు అవమానం జరిగింది. పీవీకేక్ కాలేజీ ఆవరణలో నారా లోకేష్ శంఖారావ సభకు జనసేన నాయకులు వస్తుండగా సెక్యూరిటీ గార్డ్ వారిని అడ్డుకున్నారు. దీంతో జనసైనికులు వాగ్వివాదానికి దిగారు. ఉమ్మడి సభకు వస్తే ఇలా అవమానిస్తారా అంటూ మండిపడ్డారు.

New Update
Janasena: అనంతపురం జిల్లాలో జనసైనికులకు అవమానం..!

Ananthapuram: ఏపీలో ఎన్నికల హాడావిడి నడుస్తోన్న సంగతి తెలిసిందే. గెలుపు లక్ష్యంగా అటు అధికార పార్టీ వైసీపీ.. ఇటు ప్రతిపక్ష పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ హోరాహోరిగా సభలు నిర్వహిస్తున్నారు. సిద్ధం సభలతో ప్రజల్లో ముందుకు దూసుకుపోతున్నారు సీఎం జగన్. మరోవైపు వైసీపీని ఓడించడానికి కంకణం కట్టుకున్న టీడీపీ జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకున్నాయి.

Also Read: ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో ఎస్బీఐకి సుప్రీం కోర్టు మొట్టికాయలు.. 

అయితే, పలుచోట్ల మాత్రం టీడీపీ జనసేనలో అసమ్మతి కొనసాగుతుంది. టికెట్ నాదంటే నాదంటే పలువురు నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నా ఘటనలు కూడా మనం చూస్తున్నాం. కేవలం సీట్ల విషయమే కాదు..తమను మీటింగ్ కూడా పిలవడం లేదంటూ కొందరూ నేతలు అలుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా మీటింగ్ కు పిలిచినా తమకు సరైనా మర్యాద ఇవ్వడం లేదని జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: 400 గజాల్లో ఇళ్ల నిర్మాణం.. ఇందిరమ్మ ఇళ్ల ప్రత్యేకతలు ఏంటో తెలుసా?

తాజాగా, అనంతపురం జిల్లాలోనూ జనసైనికులకు అవమానం జరిగింది. పీవీకేక్ కాలేజీ ఆవరణలో నారా లోకేష్ శంఖారావ సభకు వస్తుండగా జనసేన నాయకులను సెక్యూరిటీ గార్డ్ అడ్డుకున్నారు. దీంతో జనసైనికులు వాగ్వివాదానికి దిగారు. ఉమ్మడి సభకు జనసేన నాయకులు వస్తే ఇలా చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాసేపు అనంతరం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వచ్చి జనసేన నాయకులకు సర్ది చెప్పి సభ వద్దకు తీసుకువెళ్లారు.

Advertisment
తాజా కథనాలు