Disease X: ముంచుకొస్తోన్న మరో డేంజర్ వైరస్.. ఈసారి కరోనాను మించి.. ప్రపంచానికి మరో పెను ముప్పు ముంచుకొస్తోందా..? కరోనా మహమ్మారిని మించి విలయం సృష్టించబోతోందా..? అంటే అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. డిసీజ్ ఎక్స్ రూపంలో భయంకరమైన మహమ్మారి ప్రపంచాన్ని చుట్టుముడుతుందని హెచ్చరిస్తున్నారు. By BalaMurali Krishna 26 Sep 2023 in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి Disease X: ప్రపంచానికి మరో పెను ముప్పు ముంచుకొస్తోందా..? కరోనా మహమ్మారిని మించి విలయం సృష్టించబోతోందా..? అంటే అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. డిసీజ్ ఎక్స్ రూపంలో భయంకరమైన మహమ్మారి ప్రపంచాన్ని చుట్టుముడుతుందని హెచ్చరిస్తున్నారు. కొవిడ్ మహమ్మారి లాగే ఈ డిసీజ్ ఎక్స్ కూడా ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమందిపై ప్రభావం చూపిస్తుందని వెల్లడించారు శాస్త్రవేత్తలు. కరోనా కంటే డిసీజ్ ఎక్స్..7 రెట్లు తీవ్రంగా ఉంటుందని..ఈ వైరస్ బారి నుంచి ప్రజలు బయటపడటం కష్టమంటున్నారు. ఈ కొత్త వైరస్‌తో కనీసం 5 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదముందని బ్రిటన్ వ్యాక్సిన్ టాస్క్‌ఫోర్స్‌కు నేతృత్వం వహించిన సైంటిస్ట్ కేట్ బ్రిఘం హెచ్చరించారు. మానవాళిగా పెద్ద సవాల్‌గా మారునున్న వైరస్.. జంతువుల్లో వైరస్ విస్తరిస్తుందని మ్యుటేషన్లు ఏర్పడి మానవాళికి పెద్ద సవాల్‌గా మారుతుందని వెల్లడించారు బ్రిఘం. "వేలాది రకాల వైరస్ల నుంచి మహమ్మారి ప్రబలేందుకు అవకాశముంది. ఇందులో 25 వైరస్ కుటుంబాలను సైంటిస్టులు గుర్తించారు. వాటిని నిత్యం పర్యవేక్షిస్తున్న శాస్త్రవేత్తలు వాటిలో ఏదైనా మహమ్మారిగా పరిణమించే అవకాశముంది" అని హెచ్చరిస్తున్నారు. మరోవైపు WHO సైతం మరో మహమ్మారిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఎప్పటినుంచో చెబుతూనే ఉంది. తాజాగా బ్రిటన్ శాస్త్రవేత్తలు చెప్పిన ఈ విషయం ఆందోళన కలిగిస్తోంది. 40 రకాల కరోనా వైరస్ జాతులు.. ఇదిలా ఉంటే జంతువుల నుంచి, ముఖ్యంగా గబ్బిలాల నుంచి వైరస్లు మానవులకు సోకుతుండటంపై పరిశోధనలు చేసి, ‘బ్యాట్‌వుమన్’గా ప్రసిద్ధి చెందిన చైనీస్ వైరాలజిస్ట్ షి ఝెంగ్లి సంచలన హెచ్చరిక చేశారు. భవిష్యత్తులో మరో కొత్త కరోనా వైరస్ పుట్టుకురావొచ్చని, దీనిని ఎదుర్కొనేందుకు ప్రపంచం సిద్ధంగా ఉండాలని తెలిపారు. వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి చెందిన షి బృందం 40 కరోనా వైరస్ జాతుల వల్ల మానవులపై పడే ప్రభావంపై అధ్యయనం చేసింది. వీటిలో దాదాపు సగం వైరస్ జాతులు అత్యంత ప్రమాదకరమైనవని గుర్తించింది. కరోనా కంటే 7రెట్లు తీవ్రతరం.. కరోనా మహమ్మారి సోకిన వారు చాలామంది కోలుకోగలిగారు. అయితే డిసీజ్ ఎక్స్ కరోనా మహమ్మారి కంటే ఏడు రెట్లు తీవ్రంగా ఉంటుందని, అధిక ప్రభావం చూపిస్తుందని ఈ వైరస్ వారి నుంచి ప్రజలు బయటపడడం కష్టమని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ క్రమంలోనే డిసీజ్ ఎక్స్ నుండి బయటపడడం కోసం బ్రిటన్ శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ అభివృద్ధి చేసే పనిలో ఉన్నారు. ఏది ఏమైనా కరోనా మహమ్మారి కంటే డిసీజ్ ఎక్స్ మరింత డేంజరస్ అని చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. #corona #disease-x మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి