TDP: అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. అభ్యర్థి మార్పుపై ఆందోళన..! తూర్పుగోదావరి జిల్లా అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. పొత్తులో భాగంగా మొదట నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరు ప్రకటించారు. అయితే, ప్రస్తుతం బీజేపీ అభ్యర్థిగా ములగపాటి శివ కృష్ణంరాజును ప్రకటించడంతో నల్లమల్లి రామకృష్ణారెడ్డి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. By Jyoshna Sappogula 28 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి New Update షేర్ చేయండి Anaparthi TDP: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. అసెంబ్లీ స్థానం బీజేపీకి ప్రకటించడంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొత్తులో భాగంగా టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మొదటగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రకటించారు. అయితే, ప్రస్తుతం ఉమ్మడి కూటమిలో భాగంగా బీజేపీ అభ్యర్థిగా ములగపాటి శివ కృష్ణంరాజు పేరును ప్రకటించారు. Also Read: పవన్ కల్యాణ్ పిలిస్తే అందుకు సిద్ధం: అనసూయ దీంతో అభ్యర్థి పేరు మార్పుపై టీడీపీ నల్లమల్లి రామకృష్ణారెడ్డి వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇంటికి చేరుకున్న కార్యకర్తలు ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే ఓ కార్యకర్త పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేయబోయాడు. వెంటనే అలర్ట్ అయిన తోటి కార్యకర్తలు, రామకృష్ణారెడ్డి కుమారుడు నల్లమిల్లి మనోజ్ ఆత్మహత్యాయత్నాని అడ్డుకున్నారు. Also Read: వాతావరణంలో మర్పులు.. దేశంలో మార్చిలోనే వడగాలులు.. 42 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీతో ఉన్న అనుబంధానికి వెన్నుపోటు పొడిచారు అంటూ కార్యకర్తలు నినాదాలు చేపట్టారు. కార్యకర్తలకు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ధైర్యం చెబుతుండగా నిరసనలు మరింత ఉధృతంగా మారాయి. నేడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తన కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి తదుపరి నిర్ణయం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. #anaparthi-tdp మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి