/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/car-4-jpg.webp)
TDP: అన్నమయ్య జిల్లా తంబళ్ళపల్లి టీడీపీలో అసమ్మతి సెగలు బయటపడ్డాయి. బడికాయలపల్లి గ్రామంలో టీడీపీ అభ్యర్థి జయ చంద్రరెడ్డి సోదరుడి కారుపై సొంత పార్టీ నేతలే రాళ్లతో దాడి చేసినట్లు తెలుస్తోంది. ఘటనలో కారు అద్ధం ధ్వంసం అయింది. ఈ దాడితో తంబళ్లపల్లి తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతుంది..? ఉమ్మడి అభ్యర్థి జయచంద్ర రెడ్డి కార్యకర్తలను కలుపుకొని పోవడంలో విఫలమయ్యారా..! అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Also Read: ముంబై లో ఎన్టీఆర్.. భార్యతో కలిసి డిన్నర్ పార్టీ.. సందడి చేసిన హృతిక్, రణ్ బీర్, ఆలియా!
అయితే, గతంలో ఇదే విధంగా పిటిఎం మండలం టి.సదుం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ సొంత మనుసులే జయచంద్రారెడ్డి కారుపై దాడి చేశారు. ప్రస్తుతం తంబళ్ళపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా అటు జనసేన ఇటు టీడీపీ, బీజేపీ కార్యకర్తలు ఎటు పోవాలో తెలయక అయోమయంలో పడ్డారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న కార్యకర్తలు, నాయకులను పక్కనపెట్టి నిన్న మొన్న వచ్చిన వారికి పట్టం కడుతున్నారని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: రోడ్డు ప్రమాదం.. సబ్ ఇన్‌స్పెక్టర్ మృతి..!
గ్రామానికి సంబంధం లేని వ్యక్తులతో పెత్తనం చలాయిస్తున్నారని బడికాయలపల్లి గ్రామంలో ఇవాళ సొంత పార్టీ కార్యకర్తలే జయచంద్రరెడ్డి తమ్ముడి కారుపై రాళ్ల దాడి చేయడం చర్చనీయాంశమైంది. ఇప్పటికైనా కూటమి అభ్యర్థి కార్యకర్తలు, నాయకులను కలుపుకొని పోతారా లేకపోతే ఇలానే ఉంటారా వేచి చూడాల్సి ఉంది..!
Follow Us