/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/rajini-1-jpg.webp)
గాంధీభవన్ ఎదుట ఉన్న పలువురి మీడియా ప్రతినిధులను కలిసి ఒక్కసారి తనను రేవంత్ రెడ్డిని కలిసే అవకాశం ఇవ్వాలని కోరింది. దీంతో రేవంత్ రెడ్డిని కలిసే అవకాశం తనకు దక్కడంతో తన ఆవేదనను చెప్పుకొంది. M. Com వరకు చదివిన ఉద్యోగం లేకపోవడంతో తను పడుతున్న ఇబ్బందులను రేవంత్ రెడ్డికి తెలిపానని చెప్పింది. తన పరిస్ధితిని అర్ధం చేసుకున్న రేవంత్ రెడ్డి తనకు అండగా నిలిచారు హర్షం వ్యక్తం చేసింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే తనకు ఉద్యోగం ఇస్తానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని సంతోషం వ్యక్తం చేసింది.
Also Read: కేసీఆర్‌పై ఈడీ, సీబీఐ కేసులు ఎందుకు వేయడం లేదు? రాహుల్ గాంధీ ఏం అన్నారంటే?
తుమ్మరి రజిని ఆర్టీవీతో ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..తనకు ప్రభుత్వం నుండి పెన్షన్ తప్ప మరే పథకం అందలేదని వాపోయింది. డబుల్ బెడ్ రూం కోసం..బ్యాంక్ లోన్ కోసం ఎన్నీ సార్లు తిరిగిన తనకు ఫలితం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేసింది. తను ఉన్న పరిస్ధితిని చూసి అందరూ తనను చిన్న చూపు చూసిన మనోధైర్యంతో ముందుకు నడుస్తున్నట్లు తెలిపింది. ఎవరైన తనకు సహాయం చేస్తే చిన్న బిజినెస్ పెట్టుకుని తన కాళ్లపై తాను నిలబడాలని కోరుకుంటుంది రజిని. చాలా వరకు కొంత మంది దివ్యంగులు ఇక ఏమీ పనిచేయలేము కదా.. మా బ్రతుకు ఇంతే అని నిరాశ చెందుతూ లైఫ్ లో ముందుకు నడవలేకపోతారని.. కానీ, తుమ్మరి రజిని మాత్రం మనోధైర్యంతో లైఫ్ లీడ్ చేస్తుందని అందరూ అభినందిస్తున్నారు.