Director Yashasvi: 'నాలా ఇంకెవరూ మోసపోవద్దు'.. మ్యూజిక్ డైరెక్టర్ రధన్‍ పై వైరలవుతున్న యశస్వి కామెంట్స్

"సిద్ధార్థ్ రాయ్'' మూవీ డైరెక్టర్ యశస్వి.. సంగీత దర్శకుడు రధన్‍ పై ఫైర్ అయ్యారు . రధన్‍ కారణంగానే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఆలస్యమైందని ఆరోపించారు. నాలా ఇంకెవరూ మోసపోవద్దని చెబుతున్నాను అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

New Update
Director Yashasvi: 'నాలా ఇంకెవరూ మోసపోవద్దు'.. మ్యూజిక్ డైరెక్టర్ రధన్‍ పై వైరలవుతున్న యశస్వి కామెంట్స్

Director Yashasvi: హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి వంటి స్టార్ డైరెక్టర్స్ దగ్గర పని చేసిన యశస్వి.. "సిద్ధార్థ్ రాయ్'' సినిమాతో డెబ్యూ డైరెక్టర్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ సినిమాలో ఆర్య, అతడు చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించిన దీపక్ సరోజ్ హీరోగా నటించారు. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 23 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ యశస్వి.. సంగీత దర్శకుడు రధన్‍ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రధన్ పై యశస్వి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాల్ వైరల్ గా మారాయి.
Also Read : Samantha Ruth Prabhu: సమంత వర్క్ ఔట్స్.. ఆ సినిమా కోసమే.. వైరలవుతున్న పోస్ట్

రధన్‍ పై డైరెక్టర్ యశస్వి కామెంట్స్

"రధన్‍ ఈ సినిమా మ్యూజిక్ విషయంలో చాలా ఇబ్బంది పెట్టారు. మూవీ షూటింగ్ త్వరగానే పూర్తయింది. కానీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఆలస్యం కావడానికి.. మ్యూజిక్ డైరెక్టర్ రధన్‍ కారణమని ఆరోపించారు. నాలా.. ఇంకెవరూ మోసపోవద్దని ఈ విషయం చెబుతున్నాను. రధన్‍ అద్భుతమైన టెక్నీషియన్ కావచ్చు.. కానీ ఇలా చేయడం ద్వారా సినిమా పాడవుతుంది. అతడు గొడవ పడడానికే మాట్లాడతాడు. అంటూ రధన్‍ తీరు పై ఫైర్ అయ్యారు. గతంలో అర్జున్ రెడ్డి సినిమా విషయంలో కూడా ఇలాగే ట్యూన్స్ ఆలస్యంగా ఇచ్చారని పేర్కొన్నారు."

publive-image

మ్యూజిక్ డైరెక్టర్ రధన్‍ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ సినిమా వికడకవి సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన రధన్.. 'అందాల రాక్షసి' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఆ తర్వాత తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించారు. చిట్టి నీ నవ్వంటే, ఉండిపోరాదే లాంటి చాట్ బస్టర్స్ తో ఫుల్ క్రేజ్ దక్కించుకున్నారు.

Also Read : Bellamkonda Sreenivas : తెలుగులో ఫ్లాప్.. అక్కడ మాత్రం సూపర్ హిట్

Advertisment
Advertisment
తాజా కథనాలు