Trivikram Srinivas: మాటలకే మాటలు నేర్పిన మాంత్రికుని బర్త్‌ డే స్పెషల్‌!

మాటల రచయితగా వెండితెరకు పరిచయం అయ్యి..దర్శకుడిగా దూసుకెళ్తున్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆర్టీవీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తుంది.

New Update
Trivikram Srinivas: మాటలకే మాటలు నేర్పిన మాంత్రికుని బర్త్‌ డే స్పెషల్‌!

Trivikram Srinivas Birthday: కొన్ని సినిమాలు మనకు చాలా కాలం వరకు గుర్తుండిపోతాయి. దానికి చాలా కారణాలు కూడా ఉంటాయి. వాటిలో ముఖ్యంగా హీరో హీరోయిన్లు అయితే..మరింత ముఖ్యమైనది డైలాగులు. కొన్ని మాటలు జీవితాంతం గుర్తుండిపోతాయి. వెండితెరను సినిమాలోని డైలాగ్‌ లతో ఎక్కడికో తీసుకు వెళ్లిన ఘనత కచ్చితంగా మాటల రచయితలదే అవుతుంది.

అలాంటి మాటల రచయితల్లో నేటి తరం వారి హృదయాలకు బాగా దగ్గరైన వ్యక్తి త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ (Trivikram srinivas) . సినిమాల మీద అభిమానంతో లెక్చరర్‌ ఉద్యోగాన్ని కూడా వదులుకుని వెండితెర వైపు అడుగులు వేసి ఎంతో మంది నేటి తరం యువ రచయితలకు ఆయన ఆదర్శంగా నిలిచారు. తెలుగు చిత్ర పరిశ్రమలో మాటల మాంత్రికునిగా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్‌ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు ఆర్టీవీ(RTV)  ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు (Special Wishes) తెలుపుతుంది.

మరీ ఆయన జీవితంలోని కొన్ని విషయాలను, విశేషాలను తెలుసుకుందామా..! స్వయం వరం సినిమాతో తొలిసారి త్రివిక్రమ్‌ వెండితెర మీదకు వచ్చారు. ఆ సినిమా నుంచే ప్రజల మీద తన మాటల గారడీని ప్రారంభించారు. ఇక అంతే త్రివిక్రమ్‌ మాటల రచయితగా సినిమా వస్తుందంటే ప్రేక్షకులు కూడా ఓ ఫన్‌ పవర్‌, పెన్‌ పవర్‌ ని ఎంజాయ్‌ చేయవచ్చు అని ఫిక్స్ అయిపోయారు.

త్రివిక్రమ్‌ ఓ డైలాగ్ రాసారు అంటే అది ఎవరికైనా ఇట్టే అర్థం అయిపోతుంది. దానిలోని భావం కూడా అర్థం అయిపోతుంది. కేవలం ఒకే ఒక్క లైన్‌ తో పంచ్‌ పేలడంతో పాటు ఫన్‌ కూడా ఉంటుంది. కేవలం అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్‌ లోనే అతి పెద్ద డైలాగ్‌ రైటర్ అయ్యారు.

ఆయన అక్కడితో ఆగలేదు. కేవలం డైలాగులు రాసే ఆయన పాపులర్‌ కాలేదు. తనలోని మరో కొత్త కోణం అయిన దర్శకుడిని కూడా బయటకు తీసుకుని వచ్చి...ప్రేక్షకులని మూడు గంటల సేపు థియేటర్ల నుంచి కదలకుండా చేశారు. మొదటి సినిమా అయిన నువ్వే..నువ్వే తో ఆయన ప్రేక్షకుల్లో మరోస్థాయిని పెంచుకున్నారు.

ప్రేమ కథకు ఫన్‌ జోడించడంతో పాటు తండ్రి కూతుళ్ల సెంటిమెంట్‌ కూడా జత చేయడంతో సినిమా విడుదలై దశాబ్ధ కాలం దాటినప్పటికీ కూడా అందులోని డైలాగ్‌ లు ఇప్పటికీ అందరికీ గుర్తే. అంతలా ఆ సినిమా ప్రేక్షకుల్లోకి వెళ్లడమే కాకుండా కొద్ది రోజుల క్రితమే రీరిలీజ్‌ కూడా అయ్యింది.

త్రివిక్రమ్‌ కెరీర్‌ లో మరో మైలు రాయి అంటే అతడు సినిమా (Athadu) అనే చెప్పుకోవచ్చు. టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు (Mahesh Babu) తో కలిసి హాలీవుడ్ రేంజ్‌ సినిమాని తీశారు. అంతే దెబ్బకి ఆయన రేంజ్‌ మారిపోయింది. కేవలం అగ్ర హీరోలతో మాత్రమే సినిమాలు తీసే స్థాయికి ఆయన వెళ్లిపోయారు. సినిమా హిట్‌ అయ్యిందా..ప్లాప్‌ అయ్యిందా అనే విషయాన్ని కూడా అభిమానులు పట్టించుకోవడం లేదు.

కేవలం త్రివిక్రమ్‌ డైలాగ్‌ ల కోసమే చాలా మంది సినిమాలు చూస్తారంటే అతిశయోక్తి కాదు. ఆయన సినిమా ఈవెంట్లలో కూడా ఎప్పుడెప్పుడూ మాట్లాడతారా అందరూ ఎదురు చూస్తుంటారు. ఆయన ఒక్కసారి మైక్‌ అందుకుని మాట్లాడుతుంటే...అలాగే వినాలనిపిస్తుంది. ఆయన కొన్ని ఫంక్షన్లలో మాట్లాడిన మాటలను మోటివేషనల్‌ స్పీచ్‌ సమయాల్లో కూడా చాలా మంది వక్తలు ప్రస్తావిస్తూంటారు.

ఆయన మాటల ద్వారా ఎంతో మంది ఇన్స్‌పైర్‌ అయ్యారు అని కూడా అనేక మంది చాలా సందర్భాల్లో చెప్పారు. కేవలం మాటలతోనే కాకుండా తన సినిమాల్లో అనుబంధాలను కూడా ఎంతో బాగా చూపిస్తారు. ఆయన తీసిన సినిమా సన్నాఫ్‌ సత్యమూర్తి సినిమాలోని విలువలను పొగొట్టుకోకూడదు అనే డైలాగ్‌ ఇప్పటికీ చాలా మంది ఫాలో అవుతున్నారు.

త్రివిక్రమ్‌ చూడటానికి చాలా సింపుల్‌ గా ఉంటారు.ఆయనని చూసిన వారు ఎవరైనా కానీ ఈ వ్యక్తి ఇలాంటి డైలాగ్‌ రాయగలరా అని కచ్చితంగా అనుమానపడతారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనేది త్రివిక్రమ్‌ ని చూసి యువ రచయితలు కూడా నేర్చుకోవాలి. మరోసారి ఆర్టీవి తరుఫున ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు.

Also read: ఎల్బీ స్టేడియంలో నేడు మోదీ బహిరంగ సభ..హైదరాబాద్‌ లో ట్రాఫిక్‌ ఆంక్షలు!

Advertisment
తాజా కథనాలు