keeda cola: 'కీడా కోలా' సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న 'కీడా కోలా' సినిమా నవంబర్ 3వ తేదీన ప్రేక్షకులను అలరించనుంది. ఇద్దరు ప్రధాన పాత్రధారులకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండటం.. కూల్ డ్రింక్ లో ఉన్న బొద్దింక వాళ్ల కంటపడటం అనే అంశం చుట్టూ ఈ కథ తిరుగుతుంది.
తరుణ్ భాస్కర్ పేరు వినగానే ఫస్ట్ గుర్తొచ్చే సినిమా 'పెళ్లిచూపులు' ఆ తర్వాత 'ఈ నగరానికి ఏమైంది' . ఆ తరువాత ఆయన నటుడిగా బిజీ కావడంతో, దర్శకుడిగా కొంత గ్యాప్ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన దర్శకత్వం వహిస్తూ నటించిన సినిమానే 'కీడా కోలా'. 'కీడా కోలా' సినిమాను వివేక్ సుధాన్షు - శ్రీకృష్ణ నిర్మించారు. తాజాగా, ఈ సినిమాను ట్రైలర్ ను విడుదల చేశారు.
Also Read: మెహ్రీన్ మండిపాటు.. సెక్స్ సీన్స్‌కు మ్యారిటల్ రేప్ కు తేడా తేలియదా..?!
నవంబర్ 3వ తేదీన 'కీడా కోలా' సినిమా విడుదల చేయనున్నారు. ఇద్దరు ప్రధాన పాత్రధారులకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండటం.. కూల్ డ్రింక్ లో ఉన్న బొద్దింక వాళ్ల కంటపడటం అనే అంశం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. క్రైమ్ కామెడీ జోనర్లో నడిచే ఈ సినిమాలో బ్రహ్మానందం ముఖ్యమైన పాత్రను పోషించారు. చైతన్య రావు .. రాగ్ మయూర్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాలో, తరుణ్ భాస్కర్ ఒక కీలకమైన పాత్రను పోషించాడు. వివేక్ సాగర్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాను, రానా సమర్పిస్తూ ఉండటం విశేషంగా మారింది.