Sukumar: సుకుమార్.. మరీ ఇంత రాక్షసుడా?

డైరెక్టర్ సుకుమార్ గురించి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది. సుకుమార్ సినిమా విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటారని. అయితే భారీ అంచనాలతో తెరెకెక్కుతున్న పుష్ప 2 విషయంలో సుకుమార్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారంట. సినిమా అవుట్ పుట్ విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కావడం లేదని టాక్. సినిమా క్వాలిటీ విషయంలో విషయంలో సుకుమార్ చాలా ఖచ్చితంగా ఉన్నట్లు తెలుస్తుంది. మరి సుకుమార్ కష్టానికి ఈ సీక్వెల్, ఎలాంటి రిజల్ట్ ఇస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

New Update
Sukumar: సుకుమార్.. మరీ ఇంత రాక్షసుడా?

Sukumar: డైరెక్టర్ సుకుమార్ గురించి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది. సుకుమార్ సినిమా విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటారు. అయితే సినిమా తీసేటప్పుడు ప్రతి సీన్, ఫ్రేమ్, విజువల్స్ ఇలా చిన్న పాయింట్ కూడా మిస్ చేయకుండా పర్ఫెక్ట్ గా రావాలని కోరుకుంటాడు. అలాగే సీన్స్ లో ప్రతి ఎమోషన్ కూడా క్షుణ్ణంగా విజువలైజ్ చేస్తాడు. అందుకే సుకుమార్ ను అందరు పని రాక్షసుడు అని అంటారు. ప్రస్తుతం పుష్ప 2(Pushpa 2) సినిమా చిత్రీకరణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా విషయంలో సుకుమార్ వర్క్ నేచర్ మరింత కాంప్లికేటెడ్ గా తయారయ్యిందంట.

భారీ అంచనాలతో తెరెకెక్కుతున్న ఈ సినిమా విషయంలో సుకుమార్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సినిమాలో ప్రతి ఒక్క సీన్ హై సినిమాటిక్ వ్యాల్యూస్, హై స్టాండర్డ్స్ తో విజువలైజ్ చేస్తున్నారట. ప్రతి సీన్ పర్ఫెక్ట్ గా వచ్చే వరకు ఎన్ని టేకులు తీసుకోవడానికైనా సిద్ధం అవుతున్నాడంట. పుష్ప(Pushpa) సినిమాకి వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి షూటింగ్ సమయంలో సుకుమార్ ఓ విధమైన టార్చర్ చూపించేవారంట. అదంతా అవుట్ పుట్ పెర్ఫెక్షన్ కోసమే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఇక పుష్ప సినిమాకు అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు రావడంతో దానికి సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2 విషయంలో సుకుమార్ మరింత పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నాడంట. మొదటి సినిమా కంటే కంటే బాగా రావాలని కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. సినిమా అవుట్ పుట్ విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కావడం లేదని టాక్.

పుష్ప సినిమాకి నేషనల్ అవార్డ్స్ రావడంతో, ఇప్పుడు సీక్వెల్ విషయంలో మరింత పకడ్బందీగా చేస్తున్నాడంట. మొదటి సినిమా కంటే భాగా రావాలని కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. క్వాలిటీ విషయంలో ఇంత డీటెయిల్డ్ గా ఉండటం వలన మూవీ షూటింగ్ కాస్త ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తుంది.

అయితే రిలీజ్ డేట్ వచ్చే ఏడాది ఆగష్టుకి ఫిక్స్ చేయడంతో సినిమాని కంప్లీట్ చేయడానికి కావాల్సినంత టైం ఉంది. అందుకే సుకుమార్ పని రాక్షసుడిలా మారిపోయి పుష్ప 2ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారంట.

మరి సుకుమార్ కష్టానికి ఈ సీక్వెల్, ఎలాంటి రిజల్ట్ ఇస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అల్లు అర్జున్ కి మొదటి సారి తెలుగులో నేషనల్ అవార్డు వరించింది. దీంతో బన్నీ కూడా పుష్ప 2 విషయంలో చాలా పాషనేట్ గా ఉన్నారు. కచ్చితంగా ఈ సీక్వెల్ తో వెయ్యి కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.

Bhagavanth Kesari Review: భగవంత్ కేసరి.. హిట్టా !! ఫట్టా !! ట్విట్టర్‌లో ఫ్యాన్స్‌ ఏం అంటున్నారంటే?

Advertisment
తాజా కథనాలు