అందమైన అమ్మాయిని ఎరగావేసి నిర్మాతను నిండా ముంచిన డైరెక్టర్.. చివరికి ఏమైందంటే

అందమైన అమ్మాయిలను ఎరగావేసి నిర్మాతనుంచి భారీగా డబ్బు వసూల్ చేయాలనుకున్న దర్శకుడిని బెంగళూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిర్మాత మహదేవ్ ఇచ్చిన కంప్లైట్ ఆధారంగా డైరెక్టర్ రవీంద్రను అదుపులోకి తీసకుని విచారిస్తున్నట్లు తెలిపారు.

New Update
అందమైన అమ్మాయిని ఎరగావేసి నిర్మాతను నిండా ముంచిన డైరెక్టర్.. చివరికి ఏమైందంటే

అందమైన అమ్మాయిని ఎరగావేసి ఓ నిర్మాతను దర్శకుడు నిండా ముంచాలనుకున్న ఇష్యూ ఇండస్ట్రీలో సంచలనం రేపింది. పలువురు యువతులను వాడుకుని నిర్మాత దగ్గరనుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూల్ చేసేందుకు ప్లాన్ చేసిన ఆ డైరెక్టర్ చివరికి కటకటాలపాలయ్యాడు. ఈ దారుణమైన సంఘటన బెంగళూర్ లో చోటుచేసుకోగా ఫిల్మ్ ఇండస్ట్రీలను కుదిపేస్తోంది.

Also read  : రెండు రూపాయల లిప్‌స్టిక్ కోసం ల‌క్ష పోగొట్టుకున్న యువతి

బెంగళూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ యువతి పన్నిన వల పుల వలలో చిక్కి ఓ నిర్మాత విలవిలలాడిన ఘటన  విస్తుపోయేలా చేసింది. ప్రముఖ దర్శకుడు రవీంద్ర కొంతమంది యువతుల సాయంతో నిర్మాతను మోసం చేయాలని చూశాడు. నిర్మాతపై లైంగిక బెదిరింపులకు పాల్పడి, డబ్బు గుంజేందుకు ప్రయత్నించే పథకం వేశాడు. అయితే ఈ విషయం గమనించిన నిర్మాత మహదేవ్‌ మా వద్దకు వచ్చి అసలు విషయం చెప్పాడు. దీంతో యువతులను పంపించి డబ్బు కోసం బెదిరించారనే ఆరోపణలను పరిగణలోనికి తీసుకుని, రవీంద్ర పన్నాగాన్ని వమ్ముచేసి అరెస్ట్ చేసినట్లు నగర పడమటి విభాగం పోలీసులు తెలిపారు. ఇక చింగారి, శ్రీకంఠ, శిశిర తదితర సినిమాలకు మహదేవ్‌ నిర్మాతగా వ్యవహరించగా నిందితుడు రవీంద్ర ‘బారబాత్‌’ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన సంఘటన దేశ వ్యాప్తంగా ఉన్న సినీ పరిశ్రమల్లో చర్చనీయాంశమైంది. కేసును దర్యప్తు చేస్తున్న పోలీసులు త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు