RGV: శృంగార తార మియా మాల్కోవాతో ఆర్జీవి.. ఫోటోలు వైరల్..!

తెలుగువాళ్లకు సంబంధించిన ఓ ఈవెంట్‌లో పాల్గొనడానికి వెళ్లిన ఆర్జీవీ అమెరికా పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో క్లోజ్‌‌గా ఉండి ఫొటోలు దిగారు. అవి ట్విట్టర్‌లో ప్రస్తుతం వైరల్‌గా మారాయి. మియా మాల్కోవా-ఆర్జీవీ కాంబోలో జీఎస్టీ అనే ఒక సినిమా గతంలో రిలీజ్‌ అయ్యింది. వర్మను చూసిన మియా వెంటనే వచ్చి హగ్‌ చేసుకుంది.

New Update
RGV: శృంగార తార మియా మాల్కోవాతో ఆర్జీవి.. ఫోటోలు వైరల్..!

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే.. కాంట్రవర్సీలకు కింగ్ ఆయన. నిత్యం ఏదో వివాదం ఆయన చుట్టూ తిరుగుతునే ఉంటుంది. ఆర్జీవి మాట్లాడినా సంచలనమే... మాట్లడక పోయినా సంచలనమే. నిత్యం ఎన్నో వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఆర్జీవీ అంతా ‘నా ఇష్టం’ అంటూ ఎవరి మాటలను లెక్కచేయడు. ఎవరు ఏం అనుకుంటారో ఆలోచించడు.. తనకు నచ్చితే సినిమా తీస్తాడు. నచ్చకపోయినా సినిమా తీస్తాడు.. తనకి నచ్చింది పోస్టు చేస్తాడు.. నచ్చనది చెప్పడానికీ పోస్ట్ చేస్తాడు. అమ్మాయిల గురించి మాట్లాడుతాడు..వాళ్లతో కలిసి ఫోటోలు, వీడియోలు కూడా చేస్తాడు..శృంగారం గురించి నిర్మోహమాటంగా ఇంటర్వ్యూలు ఇచ్చే రాంగోపాల్‌ వర్మ..అప్పట్లో పోర్న్‌ స్టార్‌ మియా మాల్కోవాతో 'జీఎస్టీ' సినిమా తీశాడు.. ఇప్పుడదే మియాతో అమెరికాలో ఫోటోలు దిగి తన సోషల్‌మీడియా అకౌంట్లలో పోస్ట్ చేశాడు. అవి కాస్త వైరల్‌గా మారాయి.

publive-image ట్విట్టర్ లో వైరల్ గా మారిన ఫోటో

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటూ పొగడ్తలు:
తెలుగువాళ్లకు సంబంధించిన ఓ ఈవెంట్‌లో పాల్గొనడానికి వెళ్లిన ఆర్జీవీ అమెరికా పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో క్లోజ్‌‌గా ఉండి ఫొటోలు దిగారు. అవి ట్విట్టర్‌లో ప్రస్తుతం వైరల్‌గా మారాయి. మియా మాల్కోవా-ఆర్జీవీ కాంబోలో జీఎస్టీ అనే ఒక సినిమా గతంలో రిలీజ్‌ అయ్యింది. ఆ సినిమాతోనే వీరిద్దరికి మంచి పరిచయం ఏర్పడింది. అయితే మియా మాల్కోవాతో తాను శృంగారంలో పాల్గొనలేదని ఇంటర్వ్యూలో చెప్పాడు ఆర్జీవీ. ఆమె శరీరంలో తనకు అన్నీ నచ్చుతాయని ఆమె ముఖం ఆమె ఆటిట్యూడ్ ఆమె మాట్లాడే విధానం అన్ని నచ్చుతాయి అని చెప్పుకొచ్చాడు.అలాగే సినిమా చేసేటప్పుడు ఆమె ఎలా చేసింది అని చూశానే తప్ప ఆమె బాడీ గాని మరి ఇంకేదైనా కానీ చూడలేదని చెప్పుకొచ్చాడు రాంగోపాల్ వర్మ. ఇప్పుడు తాజాగా అమెరికా వెళ్లడంతో మియాను కలిశాడు ఆర్జీవీ. వర్మను చూసిన మియా వెంటనే వచ్చి హగ్‌ చేసుకుంది. ఇక మరో ఫోటోలో.. 'బొమ్మా..నిజమా అని అనుకున్నానని..కానీ ఇది ఇర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌' అంటూ పొగడ్తల వర్షం కురిపించాడు ఆర్జీవీ. అంటే అంత అందంగా ఉందని ఆయన అర్థం. అమ్మాయిలకు బిస్కెట్‌ వేయడం ఆర్జీవీ నుంచే నేర్చుకోవాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

publive-image మియా మాల్కోవాతో ఆర్జీవి

ఆర్జీవీ డెన్ చూశారా..?
ఇటివలి కాలంలో ఆర్జీవీ డెన్‌ న్యూస్‌ సోషల్‌మీడియాలో చక్కర్లు కొట్టింది. ఆర్జీవీ(RGV) డెన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆర్టీవీ(RTV) వర్మను ఇంటర్వ్యూ చేసింది. ఆర్జీవీ డెన్ ఆఫీస్ ఎంట్రన్స్‌ మొదలుకొని భవనం మొత్తం కూడా చాలా డిఫరెంట్‌గా ఉంది. ఆయన మెంటాలిటీకి తగినట్లుగా మోటివేటివ్ కొటేషన్స్ ఉంచారు. అలాగే తన బ్లాక్ బస్టర్ సినిమాల షూటింగ్ ఫోటోలు, ఆయా సినిమా నటీనటులతో కలిసి తీసుకున్న ఫోటోలను గోడలపై ఉంచారు ఆర్జీవీ. మరీ ముఖ్యంగా అడల్ట్ సినిమా జీఎస్టీ పోస్టర్స్ ఆ సినిమాకు సంబంధించిన బోల్డ్ ఫోటోలకు స్పెషల్ ప్రియార్టీ ఇచ్చారు.ఇక న్యూడ్‌, సెమీ న్యూడ్ ఫోటోలు సైతం ఆఫీస్‌లో కనిపిస్తాయి. ఇలా తనకు నచ్చింది చేయడమే ఆర్జీవీకి తెలుసని ఆయన్ను అభిమానించేవాళ్లు చెప్పుకుంటారు. మిగిలిన వాళ్లు ఆర్జీవీని విమర్శిస్తుంటారు. అటు అభిమానించేవాళ్లని కానీ.. విమర్శించేవాళ్లని కానీ పట్టించుకోని ఆర్జీవీ తనకు నచ్చిందే చేస్తాడు. ఎవరేం అనుకున్నా డోంట్‌ కేర్..అంతే..!

Advertisment
Advertisment
తాజా కథనాలు