Harish Shankar : 'మిస్టర్ బచ్చన్' ప్లాప్.. హరీష్ శంకర్ చేసిన పనికి నెటిజన్స్ ప్రశంసలు

హరీష్ శంకర్, రవితేజ కాంబోలో వచ్చిన 'మిస్టర్ బచ్చన్' మూవీ అట్టర్ ప్లాప్ అయిన విషయం తెలిసిందే. ఈ మూవీతో నిర్మాతలకు నష్టాలొచ్చాయి. ఈ క్రమంలోనే డైరెక్టర్ హరీష్ శంకర్ తన రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆయనపై నెటిజన్స్ ప్రశంసలు కురిసిపిస్తున్నారు.

New Update
Harish Shankar : 'మిస్టర్ బచ్చన్' ప్లాప్.. హరీష్ శంకర్ చేసిన పనికి నెటిజన్స్ ప్రశంసలు

Director Harish Shankar : మాస్ మహారాజు రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ రవితేజ 'మిస్టర్ బచ్చన్' సినిమా ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ తొలిరోజే నుంచి డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. రిలీజ్‌కి ముందు దర్శకుడు హరీశ్ శంకర్ హైప్ పెంచేలా కామెంట్స్ చేశాడు.

కానీ సినిమాకి విపరీతమైన నెగిటివ్ టాక్ రావడంతో డైరెక్టర్ హరీష్ శంకర్ ను సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలొచ్చాయి. అవుడ్ డేటెడ్ కంటెంట్ తీసుకోని దానికి కమర్షియల్ హంగులు అంటూ హరీష్ చేసిన ప్రయోగం బెడిసి కొట్టడంతో నిర్మాతలకు భారీ నష్టాలు వచ్చాయి. ఈ క్రమంలోనే డైరెక్టర్ హరీష్ శంకర్ తన రెమ్యునరేషన్ ను వెనక్కి ఇచ్చేసినట్లు తెలుస్తోంది.

Also Read : వరద బాధితులకు అండగా సోనూసూద్.. ఒక్క మెసేజ్ చేస్తే చాలు

ప్రస్తుతానికి రెండు కోట్లు రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చారని, త్వరలో మరి కొంచె వెనక్కి ఇచ్చే అవకాశముందని సమాచారం. సినిమా నష్టపోతే ఇలా పారితోషికం వెనక్కి ఇచ్చి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లని ఆదుకోవడం మంచి విషయమే అని, హరీష్ శంకర్ మంచి నిర్ణయం తీసుకున్నారని పలువురు నెటిజన్స్ డైరెక్టర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు